చంపాపేట: నాగార్జున సాగర్ నుంచి మీరాల, సంతోష్‌నగర్, మాదన్నపేట తాగు నీటి నిల్వ కేంద్రాలకు ఏర్పాటు చేసిన కృష్ణా ప్రధాన పైపు బుధవారం చంపాపేట డీఎంఆర్‌ఎల్ రోడ్డు వద్ద లీకయింది. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర నీరు ఏరులై పారింది. మాన్‌హోల్స్ నుంచి నీరు రెండు గంటల పాటు ఎగిసి పడడంతో డీఎంఆర్‌ఎల్ రహదారిపై మోకాలి లోతు నీరు ప్రవహించింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఉప్పల్, ఎల్‌బీనగర్, కర్మన్‌ఘాట్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఆలస్యంగా స్పందించిన జల మండలి అధికారులు పైపులైనుకు మరమ్మతులు చేసి, నీటి లీకేజీని అరికట్టగలిగారు.
పగిలిన కృష్ణా పైప్‌లైన్
Published Wed, May 11 2016 4:42 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM
Advertisement