champapet
-
చంపాపేట్ లో స్వప్న హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
-
కోమాలో భర్త, భార్య దారుణ హత్య.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చంపాపేట్‌లో వివాహిత స్వప్న హత్య కేసు తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, ఈ కేసులో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. దర్యాప్తులో భాగంగా స్వప్న హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెర మీదకు ప్రియుడు సతీష్ పేరు రావడంలో కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి వివరాల ప్రకారం.. మృతురాలు స్వప్న గతంలో సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా, స్వప్నకు ప్రేమ్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే స్వప్న వివాహం జరిగిన తరువాత కూడా మాజీ ప్రియుడు సతీష్‌తో కాంటాక్ట్‌లోనే ఉన్నది. సతీష్ చంపాపేట్‌లోని స్వప్న ఇంటికి తరుచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఈ విషయం ప్రేమ్‌కు తెలియడంతో సతీష్‌తో ఇటీవల గొడవలు జరిగాయి. అయితే, నిన్న(శనివారం) ఉదయం 11:30 గంటలకు చంపాపేట్‌లోని స్వప్న ఇంటికి సతీష్ తన స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న సతీష్.. స్వప్నను దారుణంగా హత్య చేశాడు. అనంతరం, స్వప్న భర్త ప్రేమ్‌ను రెండవ అంతస్తు నుండి కిందకు నెట్టేసాడు. ఈ క్రమంలో ప్రేమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమ్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ వాంగ్మూలాన్ని తీసుకుంటే కేసును ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా అతను స్పృహలోకి ఎప్పుడు వస్తాడో తెలియరాలేదు. ఈ క్రమంలో స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం... భార్యా భర్తలు మృతి -
‘ఇల్లు కూల్చితే మా చావును చూస్తారు..’
సాక్షి, చంపాపేట(హైదరాబాద్): పక్కింటి యజమాని ఫిర్యాదుతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఇంటిని కూల్చివేసేందుకు సమాయత్తం అవుతుండగా కూల్చివేతలు నిలిపివేయాలంటూ కుటుంబ సభ్యులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని అనడంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం రాత్రి చంపాపేట డివిజన్లో చోటు చేసుకుంది. టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్ దుర్గానగర్‌కాలనీకి చెందిన తేలుకుంట్ల రాజు 35 సంవత్సరాలుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. తన ఇల్లు శిథిలావస్థకు చేరటంతో ఇటీవలే పాత ఇంటిని కూల్చి పునర్నిర్మాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంటి పక్కనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న శ్రీనివాస్ ఇంటి పునర్నిర్మాణం చేసేందుకు అభ్యంతరం తెలిపి కోర్టు నుంచి స్టే ఆర్డరు కూడా తెచ్చారు. ఆవేమీ పట్టించుకోని రాజు ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయటంతో గురువారం శ్రీనివాస్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది జేసీబీతో సంఘటనా స్థలానికి చేరి ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా రాజు కుటుంబ సభ్యులు కూల్చివేత నిలిపేయాలంటూ కిరోసిన్ డబ్బాలు చేత పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి రాజుకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. -
పగిలిన కృష్ణా పైప్‌లైన్
చంపాపేట: నాగార్జున సాగర్ నుంచి మీరాల, సంతోష్‌నగర్, మాదన్నపేట తాగు నీటి నిల్వ కేంద్రాలకు ఏర్పాటు చేసిన కృష్ణా ప్రధాన పైపు బుధవారం చంపాపేట డీఎంఆర్ఎల్ రోడ్డు వద్ద లీకయింది. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర నీరు ఏరులై పారింది. మాన్హోల్స్ నుంచి నీరు రెండు గంటల పాటు ఎగిసి పడడంతో డీఎంఆర్ఎల్ రహదారిపై మోకాలి లోతు నీరు ప్రవహించింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఉప్పల్, ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఆలస్యంగా స్పందించిన జల మండలి అధికారులు పైపులైనుకు మరమ్మతులు చేసి, నీటి లీకేజీని అరికట్టగలిగారు. -
పేలిన సిలిండర్.. తప్పిన ప్రమాదం
-
రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
చంపాపేట: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. సోమవారం ఉదయం చంపాపేట సామ గంగారెడ్డి కాలనీలో మహిళ మెడలో బంగారు గొలుసును తెంపుకుపోయారు. మణెమ్మ అనే గృహిణి గుడికి వెళుతున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటన ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలో ఓ దుండగుడు మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించుకుపోయాడు. రామిడి కనకలక్ష్మి అనే మహిళ కిరాణ షాపును తెరిచి శుభ్రం చేసుకుంటుంది. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ కావాలని అడిగాడు. అతడికి సిగరెట్ ఇచ్చిన అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లుతున్న సమయంలో దుండగుడు ఆమె వెనుక నుంచి పుస్తెలతాడును తెంపుకుపోయాడు. -
సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య
ఆమెను కిడ్నాప్ చేసి మోసగించిన ఆలయ చైర్మన్ నిందితుడికిప్పటికే రెండు పెళ్లిళ్లు.. భూ సెటిల్మెంట్ల కేసులు అతన్ని అరెస్టు చేసిన ఐదు రోజులకే ఘటన సాక్షి, హైదరాబాద్: రాజధానికి చెందిన అనూష (22) అనే యువతి బుధవారం తెల్లవారుజామున నాగార్జునసాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులతో కలిసి కారులో ఓ దర్గాకు వెళ్తూ మార్గమధ్యంలో ఈ దారుణానికి పాల్పడింది. ఆమెను మాయమాటలతో కిడ్నాప్ చేసి మోసగించిన ఓ చీటర్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఐదు రోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌పార్క్ కాలనీకి చెందిన అనూష ఇంజనీరింగ్ చేసి, స్థానికంగా బోటిక్ షాప్ నిర్వహిస్తోంది. ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ గుంటి రాజేశ్ (33) ఆమెను మాయమాటలతో లోబర్చుకుని ఫిబ్రవరి 27న కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా అయిన రాజేశ్‌కు వివాదాస్పద స్థలాలు కొనే, సెటిల్మెంట్లు చేసే చరిత్ర కూడా ఉంది. అతనికిప్పటికే రెండు పెళ్లిళ్లు కూడా చేసుకున్నాడు. 2003లో భారతి అనే ఆమెను పెళ్లి చేసుకోగా ముగ్గురు పిల్లలు కలిగారు. 2010లో మన్సూరాబాద్‌లో ఉండే రోమాసింగ్ అనే ఇద్దరు పిల్లల తల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. తనను మోసగించి రెండో పెళ్లి చేసుకున్నాడంటూ ఆమె నెల క్రితమే సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో రాజేశ్‌పై ఫిర్యాదు చేసింది. అతనిపై హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ పోలీసుస్టేషన్లలో భూ వివాదాల కేసులు కూడా ఉన్నాయి. అతనిపై పీడీ చట్టం ప్రయోగించడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో పెళ్లి చేసుకునేందుకు వేట ప్రారంభించిన రాజేశ్, ఆ క్రమంలోనే అనూషతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలతో లోబర్చుకుని ఫిబ్రవరి 27న ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు చైతన్యపురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి మార్చి 14న రాజేశ్‌ను అరెస్టు చేశారు. అనూష వాంగ్మూలం మేరకు అతనిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టి జైలుకు తరలించారు. రాజేశ్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో డిప్రెషన్‌కు లోనైన అనూష కొద్ది రోజులుగా తనలో తాను కుమిలిపోసాగింది. దాంతో తండ్రి శ్యాంసుందర్‌రెడ్డి, తమ్ముడు రాజేంద్రనాథ్, నాయనమ్మ లక్షీనర్సమ్మ ఆమెను తీసుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి కారులో నెల్లూరు జిల్లా రహమతాబాద్ దర్గాకు బయల్దేరారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సాగర్ నూతన బ్రిడ్జి వద్దకు చేరుకోగానే బహిర్భూమికని చెప్పి కారు దిగిన అనూష ఎంతసేపటికీ తిరిగిరాలేదు. చుట్టుపక్కలంతా వెదికిన అనంతరం విజయపురిసౌత్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెల్లవారాక అనూష మృతదేహం బ్రిడ్జి కింద నీటిలో పోలీసులకు కనబడింది. ఆమెకు పాదాలు, నడుము దగ్గర తీవ్రగాయాలయ్యాయి. అనూష మృతదేహాన్ని సాగర్‌లోని కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించి, పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. అనూష మృతితో గ్రీన్‌పార్క్ కాలనీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నట్లు ఎస్ఐ తెలిపా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. సైబరాబాద్ జా యింట్ పోలీస్ కమిషనర్ శశిధర్‌రెడ్డి, ఎల్బీనగర్ డీసీ పీ తస్వీర్ ఇక్బాల్, ఏసీపీ సీతారాం చైతన్యపురి ఠాణా కు చేరుకుని రాజేశ్ కేసు విషయంపై ఆరా తీశారు.