లీకైన షియోమి ఫోన్లు: అదరగొట్టే ఫీచర్లివే! | Xiaomi Mi 6 and Mi 6 Plus specs, pricing details leak ahead of April 11 launch | Sakshi
Sakshi News home page

లీకైన షియోమి ఫోన్లు: అదరగొట్టే ఫీచర్లివే!

Published Tue, Mar 28 2017 3:24 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

లీకైన షియోమి ఫోన్లు: అదరగొట్టే ఫీచర్లివే! - Sakshi

లీకైన షియోమి ఫోన్లు: అదరగొట్టే ఫీచర్లివే!

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలన విక్రయాలతో దూసుకెళ్తున్న షియోమి, మరో రెండు స్మార్ట్ ఫోన్లతో వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల స్పెషిఫికేషన్లు లాంచింగ్ ముందే ఆన్ లైన్ లో లీకైపోయాయి. డిస్ప్లే, ప్రాసెసర్, స్టోరేజ్, కెమెరా వంటి అన్ని ప్రత్యేకతలు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. షియోమి ఎంఐ 6, షియోమి ఎంఐ 6 ప్లస్ల పేరుతో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఏప్రిల్ 11న లాంచ్ కాబోతున్నాయి. లీకైన వీటి స్పెషిఫికేషన్ వివరాలు ఓ సారి చూద్దాం...
 
ఎంఐ 6 స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్లు...
5.15 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే
2.45 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీ
32జీబీ, 64జీబీ లేదా 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు
4జీబీ లేదా 6జీబీ ర్యామ్
19ఎంపీ సోనీ ఐఎంఎక్స్400 సెన్సార్తో ప్రైమరీ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ షూటర్
3200 ఎంఏహెచ్ బ్యాటరీ(నాన్-రిమూవబుల్)
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
దీని ధరలు సుమారు రూ.19,000 నుంచి రూ.26,000 మధ్యలో ఉంటాయట. 
 
ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్లు...
5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే
2.45 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీ
64జీబీ లేదా 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు
6జీబీ ర్యామ్
12ఎంపీతో డ్యూయల్ కెమెరా
ఫ్రంట్ 8ఎంపీ సెల్ఫీ షూటర్
4500ఎంఏహెచ్ బ్యాటరీ (నాన్ రిమూవబుల్)
ఆండ్రాయిడ్ 7.0 నోగట్
దీని ధరలు సుమారు రూ.24,680 నుంచి రూ.33,226 మధ్యలో ఉంటాయట. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement