భారత్‌లోకి షావోమి తొలి డ్యూయల్‌-కెమెరా ఫోన్‌ | Xiaomi could launch Mi 5X or Mi 6 in India next month | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి ఎంఐ 5ఎక్స్‌ లేదా ఎంఐ 6

Published Thu, Aug 10 2017 1:49 PM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

భారత్‌లోకి షావోమి తొలి డ్యూయల్‌-కెమెరా ఫోన్‌

భారత్‌లోకి షావోమి తొలి డ్యూయల్‌-కెమెరా ఫోన్‌

న్యూఢిల్లీ : చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండే స్మార్ట్‌ఫోన్లను డ్యూయల్‌ రియర్‌ కెమెరాలతో లాంచ్‌ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఇంకా భారత్‌లోకి ప్రవేశించలేదు. త్వరలోనే ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఒకటి అంటే తొలి డ్యూయల్‌ కెమెరా షావోమి స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్‌లోకి రాబోతుంది. ఈ విషయాన్ని షావోమి మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్‌ తన మైక్రోబ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. '' ఇంకా మీరు ఎన్నో రోజులు వేచిచూడాల్సిన పనిలేదు. షావోమి తొలి డ్యూయల్‌ కెమెరా ఫోన్‌ వచ్చే నెలలో భారత్‌లోకి వచ్చేస్తోంది. అయితే అదేంటో మీరు గెస్‌ చేయగలరా?'' అని జైన్‌ ట్వీట్‌ చేశారు.   
 
అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఒకటి షావోమి ఎంఐ 5ఎక్స్‌ను గత నెలలోనే చైనా మార్కెట్‌లోకి లాంచ్‌ చేశారు. 4GB+64GB తో దీన్ని అక్కడ ప్రవేశపెట్టారు. దీని ధర అక్కడ 1,499 యువాన్లు. భారత్‌లో సుమారు 14,200 రూపాయల వరకు ఉండొచ్చు. ఈ ఫోన్‌ అతిపెద్ద ఆకర్షణ, వెనుకవైపు రెండు కెమెరాలు. రెండు కూడా 12 మెగాపిక్సెల్‌వే. ఫ్రంట్‌ వైపు రియల్‌-టైమ్‌ బ్యూటిఫికేషన్‌ ఫీచర్‌తో 5ఎంపీ కెమెరాను అమర్చింది కంపెనీ. 5.5 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే, ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌, 128జీబీ విస్తరణ మెమరీ, 3080ఎంఏహెచ్‌ బ్యాటరీ దీనిలో మిగతా ఫీచర్లు.  
 
ఇక ఎంఐ 6 విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను షావోమి ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్‌ చేసింది. క్వాల్‌కామ్‌ లేటెస్ట్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌ఓసీతో ఇది రూపొందింది. 6జీబీ ర్యామ్‌, 5.15 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 3.5ఎంఎం ఆడియో జాక్‌, 64జీబీ, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 3,350 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. ఈ ఫోన్‌కు కూడా 12ఎంపీ లెన్స్‌తో వెనుకవైపు రెండు కెమెరాలున్నాయి. దీంతో 4కే వీడియో రికార్డింగ్‌ సామర్థ్యం కలిగి ఉంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఇది రూపొందింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement