చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎంఐ 6సీ'ని త్వరలో విడుదల చేయనుంది. చైనీస్ సామాజిక సైట్ బైడులో ధర, స్టోరేజ్, స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు బహిర్గతమయ్యాయి. ప్రధానంగా 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానుంది. స్టోరేజ్ ఆధారంగా వీటి ధరలు వరుసగా రూ.18,900, రూ.23,600గా ఉండనుంది. అలాగే ఈ ఫోన్‌కు సంబంధించిన లీక్ అయిన వెనుక, ముందు భాగాల ఫోటోల ఆధారంగా వెనుకవైపు ద్వంద్వ కెమెరా సెటప్ లేదు. ఫ్లాష్ మాడ్యూల్తోపాటు పైన ఒకే ప్రధాన సెన్సార్ మాత్రమే ఉంది. అయితే, లీక్ ఫ్లాష్ ప్రక్కన ఉన్న నల్లని విండో 5 మెగాపిక్సెల్ ద్వితీయ కెమెరాగా కనిపిస్తోంది. రీసెంట్ లీక్ ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇలా ఉండనున్నాయని అంచనా.
షావోమీ 'ఎంఐ 6సీ' ఫీచర్లు
5.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్
4/6 జీబీ ర్యామ్
64/128 జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4100 ఎంఏహెచ్ బ్యాటరీ