ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో వరుసగా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తుంది. ఆకట్టుకునే ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరల్లో ఆఫోన్‌లు లభ్యం కావడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే తాజాగా వివో 'వై71టీ' సిరీస్ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ముందుగా ఈఫోన్ చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉండగా..త్వరలో భారత్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
వివోవై71టీ స్పెసిఫికేషన్స్
వివోవై71టీ 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.44అంగుళాల (1,080*2, 2,400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లే, 20.9 యాస్పెట్ రేషియో అండ్ 90.1పర్సెంట్ స్క్రీన్ టూ బాడీ రేషియో,ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్‌సిటీ 810ఎస్‌ఓఎస్, జీ57జీపీయూ, ఎల్‌డీఆర్‌ఆర్4 ర్యామ్‌తో 8జీబీని అందిస్తుంది. వర్చువల్ వర్క్‌తో పాటు మల్టీటాస్క్ వర్క్ కోసం 4జీబీని అదనంగా వినియోగించుకోవచ్చు.
ఇక ఫోటోస్, వీడియోస్ కోసం డ్యూయల్ రేర్ కెమెరా సెటప్, ఎఫ్/1.79లెన్స్‌తో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,ఎఫ్/2.2 ఆల్ట్రావైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 16మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, ముందు భాగంలో ఎఫ్/2.0లెన్స్ కెమెరా సెన్సార్లు ఉన్నాయి. వివో వై71టీ యూఎఫ్‌ఎస్ 2.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో 256వరకు జీబీ, కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ వివోఎల్‌టీఈ,వైఫై, బ్లూటూత్ బీ 5.1, జీపీఎస్/ఏ-జీవీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యాంబీనెట్ లైట్, గ్రైస్కోప్, మ్యాగ్నెటోమీటర్,ప్రోక్సిమిటీ సెన్సార్ తో పాటు డిస్‌ప్లేలో ఫింగర్ ఫ్రింట్ సెన్సార్లు ఉన్నాయి.
వివో వై 71టీ ధర
వివో వై 71టీ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.21,000 ఉంది. 8జీబీ ప్లస్ 256జీబీ ఆప్షన్ ఉన్న ఫోన్ ధర రూ.23,400 ఉండనుంది. మిరేజ్, మిడ్ నైట్ బ్లూ కలర్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ప్రీ ఆర్డర్లు చైనాలో ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి అమ్మకాలు ప్రారంభం కాగా మిగిలిన దేశాల్లో ఆఫోన్ ధర ఎంత ఉంటాయనేది వివో ప్రకటన చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment