గూగుల్ కొత్త ఫోన్లు లీక్: ఫీచర్లివేనట!
గూగుల్ కొత్త ఫోన్లు లీక్: ఫీచర్లివేనట!
Published Mon, Jun 26 2017 1:54 PM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM
గూగుల్ తన సొంత బ్రాండులో గతేడాదే పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విజయవంతమైన పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ ఎల్ స్మార్ట్ ఫోన్లకు సక్సెసర్ గా మరో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను గూగుల్ రూపొందిస్తుందని పలు రిపోర్టులు వచ్చాయి. వాటికి సంబంధించిన కోడ్ నేమ్స్ తైమెన్, ముస్కీ, వాల్లీలుగా పలు లీకేజీ వివరాలు ఆన్ లైన్ హల్ చల్ చేశాయి. తాజా రూమర్ల ప్రకారం ముస్కీ కోడ్ నేమ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను గూగుల్ ఇప్పుడు రూపొందించడం లేదని, స్టాండర్డ్, పెద్ద సైజు వాల్లీ, తైమెన్ లపై కంపెనీ ఎక్కువగా దృష్టిసారించిందనే సమాచారం చక్కర్లు కొడుతోంది.
దీనిలో వాల్లీ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 2గా, తైమెన్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ ఎక్స్ఎల్ 2గా టెక్ లీకేజీలు చెబుతున్నాయి. ఈ రెండు డివైజ్ ల స్పెషిఫికేషన్స్ వివరాలను ఎక్స్డీఏ డెవలర్లు సంపాదించారు. వారి రిపోర్టు ప్రకారం గూగుల్ పిక్సెల్2 స్మార్ట్ ఫోన్, 4.97 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, క్వాల్ కాల్ తాజా ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 835, 4జీబీ ర్యామ్ ఉన్నట్టు టాక్. స్టీరియో స్పీకర్లతో కూడా ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని అంచనా.
అదేవిధంగా గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 2 స్మార్ట్ ఫోన్ కూడా 5.99 అంగుళాల ఓలెడ్ డిస్ ప్లే, 1440పీ రెజుల్యూషన్, 128జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ కలిగి ఉండబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. డిజైన్ విషయంలో పిక్సెల్ ఎక్స్ఎల్2 స్మార్ట్ ఫోన్ టూ-టోన్ గ్లాస్, గ్లాస్ విండోతో పాటు మెటల్ ఫిన్నిష్ తో ఇది రూపొందుతుందని తెలుస్తోంది. ఎక్స్డీఏ లీక్స్ ప్రకారం, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 2 స్మార్ట్ ఫోన్ కు వెనుకవైపు కెమెరా ఉన్నట్టు తెలిసింది. అయితే పలు ఇతర రిపోర్టులు ఈ ఫోన్ కు డ్యూయల్ కెమెరా సెన్సార్ ను సూచిస్తున్నాయి. పలు స్టోరేజ్ వేరియంట్లతో ఇవి వినియోగదారులను అలరించనున్నాయట.
Advertisement