Google Pixel 2
-
ఐఫోన్ ఎక్స్ అద్దె రూ.4,299
ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, వెహికిల్స్‌ను అద్దెకు తీసుకుని వాడుకోవడం తెలిసే ఉంటుంది. కానీ స్మార్ట్‌ఫోన్ అద్దెకు తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. కన్జ్యూమర్ రెంటల్ వెబ్సైట్ రెంటోమోజో, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, వెహికిల్స్‌తో పాటు స్మార్ట్ఫోన్లను అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్ ఫ్లాగ్షిప్ డివైజ్‌లు ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8లను ఆరు నెలలకు, ఏడాదికి, రెండేళ్లకు అద్దెకు ఇవ్వడం ఆఫర్ చేస్తోది. ఈ స్మార్ట్ఫోన్ల అద్దె నెలకు రూ.2,099 నుంచి ప్రారంభమై, రూ.9,299 వరకు ఉంది. రెండేళ్ల అద్దె తర్వాత ఆ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ సొంతం కూడా చేసుకునే ఆప్షన్‌ను రెంటోమోజో ఆఫర్ చేస్తోంది. రెంటోమోజో వెబ్సైట్లో ఐఫోన్ ఎక్స్ అద్దె నెలకు 4,299 రూపాయలుగా ఉంది. ఒకవేళ 24 నెలలు పాటు అద్దెకు దీన్ని బుక్ చేసుకోవాలంటే 4,299 రూపాయలను నెల నెలా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరు నెలలకు దీన్ని అద్దెకు తీసుకోవాలనుకుంటే, నెలకు రూ.9,299ను చెల్లించాలి. ఎక్కువ కాలం పాటు అద్దెలు, వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ 24 నెలల తర్వాత ఈ ఐఫోన్ ఎక్స్ మీకు కావాలంటే అదనంగా రూ.15,556ను చెల్లించాలి. తొలుత రీఫండబుల్ డిపాజిట్‌గా 9,998 రూపాయలను కూడా రెంటోమోజో తీసుకుంటోంది. అత్యంత తక్కువ అద్దె గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌పై ఉంది. 24 నెలల కాలానికి నెలవారీ 2,099 రూపాయలను చెల్లించాలి. ఆరు నెలలకు దీని అద్దె నెలవారీ 5,398 రూపాయలుగా ఉంది. గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌కు కూడా రూ.5,398 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. అలాగే ఐఫోన్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ నోట్ 8లు కూడా అద్దెకు అందుబాటులో ఉన్నాయి. రెంటోమోజో అద్దెకు ఉంచిన డివైజ్‌లన్నీ ఖరీదైనవే. కొంత కాలమైనా ఆ ఫోన్లను వాడాలనే ఆశ కలిగి వారికి, రెంటోమోజో ఈ బంపర్ కానుకను అందిస్తుంది. -
రూ.70 వేల ఫోన్, రూ.11వేలకే!
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్తగా మరో సేల్‌ను ప్రారంభించింది. సూపర్ వాల్యు వీక్ పేరుతో నేటి నుంచి ఈ సేల్కు తెరలేపింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ జూన్ 24 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా కొత్త స్మార్ట్ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, బైబ్యాక్ గ్యారెంటీలు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. గూగుల్ పిక్సెల్ 2, ఐఫోన్ 6, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, మోటో ఎక్స్4 వంటి పాపులర్ మొబైల్ ఫోన్లను ఈ సేల్‌లో అందుబాటులో ఉంచింది. ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యు వీక్ సేల్... సూపర్ వాల్యు వీక్ సేల్ కింద, ఫ్లిప్‌కార్ట్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది. బైబ్యాక్ గ్యారెంటీతో పిక్సెల్ 2 128 జీబీ మోడల్ కేవలం 10,999 రూపాయలకే అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 70వేల రూపాయలు. అయితే ఈ ఆఫర్ పొందాలంటే, వినియోగదారులు తొలుత రూ.199తో బైబ్యాక్ గ్యారెంటీ పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 9,001 రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతో పిక్సెల్ 2 ఫోన్ ధర 60,999 రూపాయలకు దిగొచ్చింది. అదేవిధంగా హెచ్డీఎఫ్ డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు అదనంగా మరో 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌తో పిక్సెల్ 2 ధర రూ.52,999కు తగ్గింది. వీటితో పాటు ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో రూ.42 వేల ఎక్స్చేంజ్ వాల్యును కొనుగోలు దారులను పొందుతారు. ఇలా పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999కు పడిపోయింది. పిక్సెల్ 2, 128 జీబీ వేరియంట్‌పైనే కాక, ఫ్లిప్‌కార్ట్ తన పిక్సెల్ 2 ఎక్స్ఎల్ 64 జీబీ మోడల్‌పై కూడా రూ.37 వేల బైబ్యాక్ గ్యారెంటీని ఆఫర్ చేస్తోంది. 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.44 వేల బైబ్యాక్‌ను అందిస్తోంది. ఇదే రకమైన ఆఫర్‌ను మోటో ఎక్స్4కు కూడా అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ రూ.6999కు లభ్యమవుతోంది. ఈ హ్యాండ్సెట్ అసలు ధర 22,999 రూపాలయు. బైబ్యాక్ గ్యారెంటీతో పాటు , ఫ్లిప్‌కార్ట్ పలు స్మార్ట్ఫోన్లపై ‘ఈజీ నో కాస్ట్ ఈఎంఐ’ ను కూడా ఆఫర్‌ను చేస్తోంది. -
గూగుల్ ‘పిక్సెల్ 2’ పై భారీ డిస్కౌంట్
సాక్షి, ముంబై: గూగుల్ లేటెస్ట్ ష్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన గూగుల్ పిక్సెల్ 2 పై స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు తీపి కబురు అందించింది. పిక్సల్ సిరీస్‌లో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇపుడు కేవలం రూ.39,999కే సొంతం చేసుకోవచ్చు. ‘బిగ్ షాపింగ్ డేస్’ పేరిట ఈ నెల 7నుంచి 9 వరకు నిర్వహించే సేల్‌లో గూగుల్ పిక్సల్2 (64జీబీ వేరియంట్) ధరపై మొత్తం రూ.21 వేల భారీ డిస్కౌంట్‌తో రూ.39,999లకే లభ్యం. గూగుల్, ఫ్లిప్‌కార్ట్ సంయుక్తంగా ఈ భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. వన్‌ప్లస్ 5టీ ధర రేంజ్‌లోకి ఈ డివైస్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ పిక్సల్ 2 అక్టోబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చింది. భారత్‌లో దీని ప్రారంభ ధర రూ.61వేలు. ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ షాపింగ్ డేస్’ సేల్‌లో దీనిపై రూ.11వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. క్రెడిట్ / డెబిట్ కార్డు వినియోగదారులకు కార్డు పేమెంట్స్ ద్వారా మరో రూ.10వేలు తగ్గింపు. మొత్తంగా రూ.21వేలు తగ్గి రూ.39,999కే ఫోన్ ఇది లభ్యం కానుంది. దీంతో పాటు ఎక్ఛ్సేంజ్ ఆఫర్ కింద రూ.18 వేలు. అంతేకాదు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.36,500 బైబ్యాక్ గ్యారెంటీని ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. అంతేకాకుండా ‘బిగ్ షాపింగ్ డేస్’ సేల్‌లో మరిన్ని ఫోన్లపై కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను అందిస్తోంది. -
గూగుల్ కొత్త స్మార్ట్ఫోన్లు..
న్యూయార్క్ : టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తన రెండో తరం పిక్సెల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ పేరుతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. నవంబర్ 15 నుంచి ఈ స్మార్ట్ఫోన్లు భారత్‌లో అందుబాటులో ఉండనున్నాయి. 61 వేల రూపాయల నుంచి వీటి ధరలు ప్రారంభమవుతాయి. గూగుల్ నేడు మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ డివైజ్‌లు, ప్రీమియం సెగ్మెంట్లో ఆపిల్ ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్, శాంసంగ్ నోట్ 8లతో పోటీ పడనున్నాయి. భారత్‌లో పాటు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా లాంటి ఐదు మార్కెట్లలో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన స్మార్ట్‌ఫోన్ కెమెరాను పిక్సెల్‌తో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందిస్తున్నట్టు గూగుల్ చెప్పింది. మంచి కెమెరాతో పిక్సెల్ 2 రూపొందిందని, ఇది కేవలం గ్రేట్ ఫోటోలను తీయడం మాత్రమే కాక, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడనుందని గూగుల్ చెప్పింది. ఈ లాంచ్ ఈవెంట్లోనే గూగుల్ లెన్స్ గురించి గూగుల్ వివరించింది. గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ 5 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండగా.. పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. 64జీబీ పిక్సెల్ 2 వెర్షన్ ధర రూ.61వేలు కాగ, 128జీబీ వేరియంట్ రూ.70వేలకు అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా 64జీబీ వెర్షన్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ధర రూ.73వేలు అని, 128జీబీ వెర్షన్ ధర రూ.82వేలు అని గూగుల్ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 26 నుంచి ప్రారంభమవుతుండగా.. నవంబర్ 1 నుంచి పిక్సెల్ 2, నవంబర్ 15 నుంచి పిక్సెల్ 2 ఎక్స్ఎల్ విక్రయానికి వస్తోంది. దేశవ్యాప్తంగా 1000 స్టోర్లతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్కార్ట్లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. -
గూగుల్ కొత్త ఫోన్లు లీక్: ఫీచర్లివేనట!
గూగుల్ తన సొంత బ్రాండులో గతేడాదే పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విజయవంతమైన పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ ఎల్ స్మార్ట్ ఫోన్లకు సక్సెసర్ గా మరో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను గూగుల్ రూపొందిస్తుందని పలు రిపోర్టులు వచ్చాయి. వాటికి సంబంధించిన కోడ్ నేమ్స్ తైమెన్, ముస్కీ, వాల్లీలుగా పలు లీకేజీ వివరాలు ఆన్ లైన్ హల్ చల్ చేశాయి. తాజా రూమర్ల ప్రకారం ముస్కీ కోడ్ నేమ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను గూగుల్ ఇప్పుడు రూపొందించడం లేదని, స్టాండర్డ్, పెద్ద సైజు వాల్లీ, తైమెన్ లపై కంపెనీ ఎక్కువగా దృష్టిసారించిందనే సమాచారం చక్కర్లు కొడుతోంది. దీనిలో వాల్లీ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 2గా, తైమెన్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ ఎక్స్ఎల్ 2గా టెక్ లీకేజీలు చెబుతున్నాయి. ఈ రెండు డివైజ్ ల స్పెషిఫికేషన్స్ వివరాలను ఎక్స్‌డీఏ డెవలర్లు సంపాదించారు. వారి రిపోర్టు ప్రకారం గూగుల్ పిక్సెల్2 స్మార్ట్ ఫోన్, 4.97 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, క్వాల్ కాల్ తాజా ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 835, 4జీబీ ర్యామ్ ఉన్నట్టు టాక్. స్టీరియో స్పీకర్లతో కూడా ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని అంచనా. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 2 స్మార్ట్ ఫోన్ కూడా 5.99 అంగుళాల ఓలెడ్ డిస్ ప్లే, 1440పీ రెజుల్యూషన్, 128జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ కలిగి ఉండబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. డిజైన్ విషయంలో పిక్సెల్ ఎక్స్ఎల్2 స్మార్ట్ ఫోన్ టూ-టోన్ గ్లాస్, గ్లాస్ విండోతో పాటు మెటల్ ఫిన్నిష్ తో ఇది రూపొందుతుందని తెలుస్తోంది. ఎక్స్‌డీఏ లీక్స్ ప్రకారం, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 2 స్మార్ట్ ఫోన్ కు వెనుకవైపు కెమెరా ఉన్నట్టు తెలిసింది. అయితే పలు ఇతర రిపోర్టులు ఈ ఫోన్ కు డ్యూయల్ కెమెరా సెన్సార్ ను సూచిస్తున్నాయి. పలు స్టోరేజ్ వేరియంట్లతో ఇవి వినియోగదారులను అలరించనున్నాయట. -
ఆ ఫోన్ అచ్చం గెలాక్సీ ఎస్8లా ఉంటుందట!
నెక్సస్ ఫోన్లకు గుడ్ బై చెప్పి, సొంత బ్రాండులో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి గూగుల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ లో పిక్సెల్ సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అయితే తాజాగా పిక్సెల్ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. పిక్సెల్ 2 పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ అచ్చం శాంసంగ్ ఎస్8, ఎస్8 ప్లస్ లను పోలి ఉంటుందని తెలుస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తోనే ఇది రూపొందుతుందట. వన్ ప్లస్5, షియోమి ఎంఐ6లకు కిల్లర్ గా గూగుల్ దీన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 మాదిరి బెండబుల్ ఓలెడ్ డిస్ప్లేతో గూగుల్ తన తర్వాతి స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తుందని టాక్. వీటి కోసం ఎల్జీ డిస్ ప్లే సంస్థ నుంచి 880 మిలియన్ డాలర్ల ఓలెడ్ డిస్ ప్లేలను కూడా ఆర్డర్ చేసిందట. మరోవైపు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో నిరంతరం ఆపిల్ తో పోటీపడే శాంసంగ్, ఆ కంపెనీకి ఓలెడ్ డిస్ ప్లేల సరుకు రవాణా చేస్తుందని తెలుస్తోంది. ముందస్తు ఫోన్ల కంటే మెరుగైన కెమెరా, 3.5ఎంఎం ఆడియో జాక్, వాటర్ ప్రూఫ్ బాడీ, ప్రీమియం మెటాలిక్ ఫిన్నిస్ తో దీన్ని రూపొందిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి.