గూగుల్‌ ‘పిక్సెల్‌ 2’ పై భారీ డిస్కౌంట్‌ | Google Pixel 2 price slashed on Flipkart: Here’s how to get the phone at Rs 39,999 | Sakshi
Sakshi News home page

గూగుల్‌ ‘పిక్సెల్‌ 2’ పై భారీ డిస్కౌంట్‌

Published Tue, Dec 5 2017 5:19 PM | Last Updated on Tue, Dec 5 2017 6:27 PM

Google Pixel 2 price slashed on Flipkart: Here’s how to get the phone at Rs 39,999 - Sakshi

సాక్షి, ముంబై: గూగుల్  లేటెస్ట్‌ ష్లాగ్‌ షిప్‌ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా విడుదల  చేసిన  గూగుల్ పిక్సెల్ 2 పై స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కు తీపి కబురు అందించింది. పిక్సల్‌ సిరీస్‌లో వచ్చిన ఈ  స్మార్ట్‌ఫోన్‌ను ఇపుడు  కేవలం రూ.39,999కే సొంతం చేసుకోవచ్చు. ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌’ పేరిట ఈ నెల 7నుంచి 9 వరకు నిర్వహించే సేల్‌లో గూగుల్‌ పిక్సల్‌2  (64జీబీ వేరియంట్)  ధరపై మొత్తం రూ.21 వేల భారీ డిస్కౌంట్‌తో  రూ.39,999లకే లభ్యం.  గూగుల్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంయుక్తంగా ఈ భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. వన్‌ప్లస్‌ 5టీ ధర రేంజ్‌లోకి  ఈ డివైస్‌ను అందుబాటులోకి తెచ్చింది.

గూగుల్‌ పిక్సల్‌ 2 అక్టోబర్‌లో  ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లోకి వచ్చింది. భారత్‌లో దీని ప్రారంభ ధర రూ.61వేలు. ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌’ సేల్‌లో దీనిపై రూ.11వేల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. క్రెడిట్ / డెబిట్ కార్డు వినియోగదారులకు కార్డు పేమెంట్స్‌ ద్వారా మరో రూ.10వేలు తగ్గింపు. మొత్తంగా రూ.21వేలు తగ్గి రూ.39,999కే ఫోన్‌ ఇది లభ్యం కానుంది. దీంతో పాటు  ఎక్ఛ్సేంజ్‌ ఆఫర్‌ కింద రూ.18 వేలు. అంతేకాదు ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.36,500 బైబ్యాక్‌ గ్యారెంటీని ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. అంతేకాకుండా  ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌’ సేల్‌లో మరిన్ని ఫోన్లపై కూడా  ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లను అందిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement