గూగుల్‌ కొత్త స్మార్ట్‌ఫోన్లు.. | Google unveils Pixel 2 & Pixel 2 XL, prices begin at Rs 61K  | Sakshi
Sakshi News home page

గూగుల్‌ కొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్‌, ధరెంతంటే...

Published Thu, Oct 5 2017 10:22 AM | Last Updated on Thu, Oct 5 2017 2:07 PM

Google unveils Pixel 2 & Pixel 2 XL, prices begin at Rs 61K 

న్యూయార్క్‌ : టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తన రెండో తరం పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. పిక్సెల్‌ 2, పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ పేరుతో వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నవంబర్‌ 15 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో అందుబాటులో ఉండనున్నాయి. 61 వేల రూపాయల నుంచి వీటి ధరలు ప్రారంభమవుతాయి. గూగుల్‌ నేడు మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఈ డివైజ్‌లు, ప్రీమియం సెగ్మెంట్‌లో ఆపిల్‌ ఐఫోన్‌ 8, ఐఫోన్‌ ఎక్స్‌, శాంసంగ్‌ నోట్‌ 8లతో పోటీ పడనున్నాయి.

భారత్‌లో పాటు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా లాంటి ఐదు మార్కెట్లలో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన స్మార్ట్‌ఫోన్‌ కెమెరాను పిక్సెల్‌తో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అందిస్తున్నట్టు గూగుల్‌ చెప్పింది. మంచి కెమెరాతో పిక్సెల్‌ 2 రూపొందిందని, ఇది కేవలం గ్రేట్‌ ఫోటోలను తీయడం మాత్రమే కాక, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడనుందని గూగుల్‌ చెప్పింది. ఈ లాంచ్‌ ఈవెంట్‌లోనే గూగుల్‌ లెన్స్‌ గురించి గూగుల్‌ వివరించింది. గూగుల్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ 5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండగా.. పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ 6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.


64జీబీ పిక్సెల్‌ 2 వెర్షన్‌ ధర రూ.61వేలు కాగ, 128జీబీ వేరియంట్‌ రూ.70వేలకు అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా 64జీబీ వెర్షన్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ధర రూ.73వేలు అని, 128జీబీ వెర్షన్‌ ధర రూ.82వేలు అని గూగుల్‌ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్లు అక్టోబర్‌ 26 నుంచి ప్రారంభమవుతుండగా.. నవంబర్‌ 1 నుంచి పిక్సెల్‌ 2, నవంబర్‌ 15 నుంచి పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ విక్రయానికి వస్తోంది.  దేశవ్యాప్తంగా 1000 స్టోర్లతో పాటు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement