గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్ సేల్‌ను అధికారికంగా ప్రారంభించిన ఒక్కరోజుల్లోనే, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ అండ్ వైట్(పాండ) వెర్షన్ అవుటాఫ్ స్టాక్ అయింది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ కూడా అనూహ్యంగా జాప్యం జరుగుతోంది. దీంతో ప్రీఆర్డర్ చేసుకుని, ఎప్పటి నుంచో ఈ స్మార్ట్‌ఫోన్ కోసం వేచిచూస్తున్న వినియోగదారులు, డెలివరీ ఆలస్యమవుతుండటంతో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అంతేకాక కొంతమంది కస్టమర్లు ఆన్‌లైన్ ఫిర్యాదులు కూడా వేస్తున్నారు. 64జీబీ స్టోరేజ్ వెర్షన్‌లో పాండ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ ప్రీ-ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు, ఫ్లిప్‌కార్ట్ బుధవారం ఓ నోటీసు జారీచేసింది. ''గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ బ్లాక్ అండ్ వెర్షన్(పాండ) స్టాక్స్ పొందడంలో అనూహ్య జాప్యాన్ని ఎదుర్కొంటున్నామని తెలియజేయడం బాధాకరంగా ఉంది'' అని కంపెనీ ఓ ఈమెయిల్‌ను పంపింది.
అధికారికంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఆలస్యాన్ని ధృవీకరించిన ఫ్లిప్‌కార్ట్, డిసెంబర్1 వరకు డెలివరీని ప్రారంభిస్తామని పేర్కొంది. డెలివరీని ఆలస్యం చేస్తున్న కారణంగా నష్టపరిహారం కింద 300 రూపాయలను చెల్లించనున్నట్టు తెలిపింది. డెలివరీ చేసిన అనంతరం ఫ్లిప్‌కార్ట్ వాలెట్ నుంచి గిఫ్ట్ కార్డు సెక్షన్ రూపంలో ఈ పరిహారం అందుబాటులో ఉంటుందని వివరించింది. పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌ను జాప్యం చేసినందుకు గాను గూగుల్ కూడా నష్టపరిహారం చెల్లించినట్టు ఆండ్రాయిడ్ పోలీసు రిపోర్టు చేసింది. కేవలం ఫ్లిప్‌కార్ట్ వద్ద మాత్రమే కాక ఆఫ్‌లైన్ రిటైలర్లు వద్ద కూడా ఈ ఫోన్ దొరకడం లేదని వెల్లడైంది. పెద్ద మొత్తంలో డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేదని ముంబై మహేశ్ మనీష్ కాంత్రి చెప్పారు. పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ పాండ వేరియంట్‌కు కస్టమర్ల నుంచి మంచి డిమాండ్ వస్తుందని తెలిపారు. కానీ అక్టోబర్ నుంచి ఈ స్టాక్ అందుబాటులో లేదన్నారు. పిక్సెల్ యూనిట్లు దొరకక పోవడం వల్ల కస్టమర్లు ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment