Google Pixel 2 XL
-
గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్.. భారీ తగ్గింపు ధరలో
సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్ పిక్సెల్ 2ఎక్స్ఎల్ పై భారీ తగ్గింపుతో అందుబాటులోకి రానుంది. దాదాపు 40శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లను ఊరించనుంది. 64జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ. 45,499లకే ఇపుడు అధికారికంగా త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీని వాస్తవ ధర రూ. 73000. గత ఏడాది నవంబరులో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అయితే హై-ఎండ్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరలో ఎలాంటి మార్పులేదు. రూ. 82,000గానే ఉండనుంది. మరోవైపు పిక్సెల్ 2ఎక్స్ఎల్కు కొనసాగింపుగా త్వరలో పిక్సెల్ 3 అక్టోబర్ 9న లాంచ్ కానుందని సమాచారం. భారతీయ మొబైల్ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల ధరల కోతపై ఖచ్చితమైన అంచనాలను వెలువరించే ముంబైకి చెందిన ఎలెక్ట్రానిక్స్ రిటైలర్ మహేష్ టెలికాం పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ధర తగ్గింపును ప్రకటించింది. అయితే త్వరలోనే ఈ ధరల తగ్గింపును సంస్థ అధికారికంగా ప్రకటించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 9న నిర్వహించనున్న పిక్సెల్ 3 లాంచింగ్ ముందే ఈ ప్రకటన రావచ్చని తెలుస్తోంది. #PriceDrop - Pixel 2 XL 64 GB now shipping with New MRP - 45499/- pic.twitter.com/QXil1EFbAE — Mahesh Telecom (@MAHESHTELECOM) September 26, 2018 -
గూగుల్ ఫోన్ డెలివరీ ఆలస్యం, ఫ్లిప్‌కార్ట్ నష్టపరిహారం
గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ సేల్‌ను అధికారికంగా ప్రారంభించిన ఒక్కరోజుల్లోనే, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ అండ్ వైట్(పాండ) వెర్షన్ అవుటాఫ్ స్టాక్ అయింది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్ కూడా అనూహ్యంగా జాప్యం జరుగుతోంది. దీంతో ప్రీఆర్డర్ చేసుకుని, ఎప్పటి నుంచో ఈ స్మార్ట్‌ఫోన్ కోసం వేచిచూస్తున్న వినియోగదారులు, డెలివరీ ఆలస్యమవుతుండటంతో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అంతేకాక కొంతమంది కస్టమర్లు ఆన్లైన్ ఫిర్యాదులు కూడా వేస్తున్నారు. 64జీబీ స్టోరేజ్ వెర్షన్లో పాండ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ప్రీ-ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు, ఫ్లిప్‌కార్ట్ బుధవారం ఓ నోటీసు జారీచేసింది. ''గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ బ్లాక్ అండ్ వెర్షన్(పాండ) స్టాక్స్ పొందడంలో అనూహ్య జాప్యాన్ని ఎదుర్కొంటున్నామని తెలియజేయడం బాధాకరంగా ఉంది'' అని కంపెనీ ఓ ఈమెయిల్‌ను పంపింది. అధికారికంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఆలస్యాన్ని ధృవీకరించిన ఫ్లిప్‌కార్ట్, డిసెంబర్1 వరకు డెలివరీని ప్రారంభిస్తామని పేర్కొంది. డెలివరీని ఆలస్యం చేస్తున్న కారణంగా నష్టపరిహారం కింద 300 రూపాయలను చెల్లించనున్నట్టు తెలిపింది. డెలివరీ చేసిన అనంతరం ఫ్లిప్‌కార్ట్ వాలెట్ నుంచి గిఫ్ట్ కార్డు సెక్షన్ రూపంలో ఈ పరిహారం అందుబాటులో ఉంటుందని వివరించింది. పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌ను జాప్యం చేసినందుకు గాను గూగుల్ కూడా నష్టపరిహారం చెల్లించినట్టు ఆండ్రాయిడ్ పోలీసు రిపోర్టు చేసింది. కేవలం ఫ్లిప్‌కార్ట్ వద్ద మాత్రమే కాక ఆఫ్‌లైన్ రిటైలర్లు వద్ద కూడా ఈ ఫోన్ దొరకడం లేదని వెల్లడైంది. పెద్ద మొత్తంలో డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేదని ముంబై మహేశ్ మనీష్ కాంత్రి చెప్పారు. పిక్సెల్ 2 ఎక్స్ఎల్ పాండ వేరియంట్‌కు కస్టమర్ల నుంచి మంచి డిమాండ్ వస్తుందని తెలిపారు. కానీ అక్టోబర్ నుంచి ఈ స్టాక్ అందుబాటులో లేదన్నారు. పిక్సెల్ యూనిట్లు దొరకక పోవడం వల్ల కస్టమర్లు ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. -
గూగుల్ కొత్త స్మార్ట్ఫోన్లు..
న్యూయార్క్ : టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తన రెండో తరం పిక్సెల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ పేరుతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. నవంబర్ 15 నుంచి ఈ స్మార్ట్ఫోన్లు భారత్‌లో అందుబాటులో ఉండనున్నాయి. 61 వేల రూపాయల నుంచి వీటి ధరలు ప్రారంభమవుతాయి. గూగుల్ నేడు మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ డివైజ్‌లు, ప్రీమియం సెగ్మెంట్లో ఆపిల్ ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్, శాంసంగ్ నోట్ 8లతో పోటీ పడనున్నాయి. భారత్‌లో పాటు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా లాంటి ఐదు మార్కెట్లలో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన స్మార్ట్‌ఫోన్ కెమెరాను పిక్సెల్‌తో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందిస్తున్నట్టు గూగుల్ చెప్పింది. మంచి కెమెరాతో పిక్సెల్ 2 రూపొందిందని, ఇది కేవలం గ్రేట్ ఫోటోలను తీయడం మాత్రమే కాక, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడనుందని గూగుల్ చెప్పింది. ఈ లాంచ్ ఈవెంట్లోనే గూగుల్ లెన్స్ గురించి గూగుల్ వివరించింది. గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ 5 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండగా.. పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. 64జీబీ పిక్సెల్ 2 వెర్షన్ ధర రూ.61వేలు కాగ, 128జీబీ వేరియంట్ రూ.70వేలకు అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా 64జీబీ వెర్షన్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ధర రూ.73వేలు అని, 128జీబీ వెర్షన్ ధర రూ.82వేలు అని గూగుల్ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 26 నుంచి ప్రారంభమవుతుండగా.. నవంబర్ 1 నుంచి పిక్సెల్ 2, నవంబర్ 15 నుంచి పిక్సెల్ 2 ఎక్స్ఎల్ విక్రయానికి వస్తోంది. దేశవ్యాప్తంగా 1000 స్టోర్లతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్కార్ట్లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. -
గూగుల్ స్మార్ట్‌ఫోన్‌కు భారీ డిస్ప్లే
శాన్ఫ్రాన్సిస్కో : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్, శాంసంగ్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు గూగుల్ స్వయంగా తన సొంత బ్రాండులో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. రెండు పిక్సెల్ స్మార్ట్ఫోన్లను గతేడాదే లాంచ్చేసింది. ప్రస్తుతం వీటికి రెండోతరం డివైజ్‌లను మార్కెట్లోకి లాంచ్‌చేసేందుకు సిద్ధమవుతోంది. గూగుల్ పిక్సెల్ 2, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ పేర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తుంది. అక్టోబర్ 5న ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ డివైజ్‌లపై ఇప్పటికే పలు రూమర్లు మార్కెట్లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. తాజాగా గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ భారీగా 5.99 అంగుళాల బెజెల్-లెస్ డిస్ప్లేతో వినియోగదారులను అలరించబోతుందని తెలుస్తోంది. పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ మాత్రం తొలితరం పిక్సెల్ డిస్ప్లేనే కలిగి ఉంటుందట. గతేడాది లాంచ్ చేసిన పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లను హెచ్‌టీసీ రూపొందించగా.. ఈ ఏడాది పిక్సెల్2 స్మార్ట్‌ఫోన్‌ను మాత్రమే హెచ్‌టీసీ రూపొందిస్తోంది. పెద్ద డిస్ప్లే కలిగిన పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్జీ రూపొందిస్తుందని తెలిసింది. పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌కు 4.97 అంగుళాల ఫుల్ హెచ్డీ ఓలెల్ డిస్ప్లే, పెద్ద బెజెల్స్ ఉండబోతున్నాయి. అయితే ఇప్పుడు రాబోతున్న ఈ రెండు స్మార్ట్ఫోన్లకు ఆడియో జాక్ ఉండదని తెలుస్తోంది. మిగతా రూమర్ల ప్రకారం ఈ రెండు స్మార్టఫోన్లు స్నాప్‌డ్రాగన్ 836 చిప్సెట్తో రూపొందుతున్నాయి. ఆగస్టు 21న లాంచ్‌చేసిన కొత్త ఆండ్రాయిడ్ ఓరియోతో ఇవి రన్ అవుతాయని తెలుస్తోంది.