సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్ పిక్సెల్ 2ఎక్స్‌ఎల్ పై భారీ తగ్గింపుతో అందుబాటులోకి రానుంది. దాదాపు 40శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కస‍్టమర్లను ఊరించనుంది. 64జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ. 45,499లకే ఇపుడు అధికారికంగా త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీని వాస్తవ ధర రూ. 73000. గత ఏడాది నవంబరులో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అయితే హై-ఎండ్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరలో ఎలాంటి మార్పులేదు. రూ. 82,000గానే ఉండనుంది. మరోవైపు పిక్సెల్ 2ఎక్స్‌ఎల్‌కు కొనసాగింపుగా త్వరలో పిక్సెల్ 3 అక్టోబర్ 9న లాంచ్ కానుందని సమాచారం.
భారతీయ మొబైల్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల ధరల కోతపై ఖచ్చితమైన అంచనాలను వెలువరించే ముంబైకి చెందిన ఎలెక్ట్రానిక్స్ రిటైలర్ మహేష్ టెలికాం పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ధర తగ్గింపును ప్రకటించింది. అయితే త్వరలోనే ఈ ధరల తగ్గింపును సంస్థ అధికారికంగా ప్రకటించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 9న నిర్వహించనున్న పిక్సెల్ 3 లాంచింగ్ ముందే ఈ ప్రకటన రావచ్చని తెలుస్తోంది.
#PriceDrop - Pixel 2 XL 64 GB now shipping with New MRP - 45499/- pic.twitter.com/QXil1EFbAE
— Mahesh Telecom (@MAHESHTELECOM) September 26, 2018
Comments
Please login to add a commentAdd a comment