గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌కు భారీ డిస్‌ప్లే | Google Pixel 2 XL to sport a 5.99-inch bezel-less display, say latest leaks | Sakshi
Sakshi News home page

గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌కు భారీ డిస్‌ప్లే

Published Mon, Aug 28 2017 4:58 PM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌కు భారీ డిస్‌ప్లే

గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌కు భారీ డిస్‌ప్లే

శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో  ఆపిల్‌, శాంసంగ్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు గూగుల్‌ స్వయంగా తన సొంత బ్రాండులో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. రెండు పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లను గతేడాదే లాంచ్‌చేసింది. ప్రస్తుతం వీటికి రెండోతరం డివైజ్‌లను మార్కెట్‌లోకి లాంచ్‌చేసేందుకు సిద్ధమవుతోంది. గూగుల్‌ పిక్సెల్‌ 2, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ పేర్లతో వీటిని మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. అక్టోబర్‌ 5న ఇవి మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఈ డివైజ్‌లపై ఇప్పటికే పలు రూమర్లు మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. తాజాగా గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ భారీగా 5.99 అంగుళాల బెజెల్‌-లెస్‌ డిస్‌ప్లేతో వినియోగదారులను అలరించబోతుందని తెలుస్తోంది. 
 
పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ మాత్రం తొలితరం పిక్సెల్‌ డిస్‌ప్లేనే కలిగి ఉంటుందట. గతేడాది లాంచ్‌ చేసిన పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్లను హెచ్‌టీసీ రూపొందించగా.. ఈ ఏడాది పిక్సెల్‌2 స్మార్ట్‌ఫోన్‌ను మాత్రమే హెచ్‌టీసీ రూపొందిస్తోంది. పెద్ద డిస్‌ప్లే కలిగిన పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌  స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ రూపొందిస్తుందని తెలిసింది. పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌కు 4.97 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఓలెల్‌ డిస్‌ప్లే, పెద్ద బెజెల్స్‌ ఉండబోతున్నాయి. అయితే ఇప్పుడు రాబోతున్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్లకు ఆడియో జాక్‌ ఉండదని తెలుస్తోంది. మిగతా రూమర్ల ప్రకారం ఈ రెండు స్మార్టఫోన్లు స్నాప్‌డ్రాగన్‌ 836 చిప్‌సెట్‌తో రూపొందుతున్నాయి. ఆగస్టు 21న లాంచ్‌చేసిన కొత్త ఆండ్రాయిడ్‌ ఓరియోతో ఇవి రన్‌ అవుతాయని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement