Producer DIL Raju Son Pic With Actor Vijay Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Dil Raju Son Photo: నెట్టింట లీకైన దిల్‌రాజు కొడుకు ఫోటో.. ఏకంగా స్టార్‌ హీరోతో ఆడుకుంటూ..

Published Tue, Nov 1 2022 11:45 AM | Last Updated on Thu, Mar 9 2023 3:35 PM

Producer Dil Raju Son Pic Goes Viral In Social Media - Sakshi

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. ఆయన సతీమణి తేజస్విని ఈ ఏడాది జూన్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే దిల్‌రాజు ఇప్పటివరకు తన కొడుకు ఫోటోను రివీల్‌ చేయలేదు. అయితే తాజాగా దిల్‌రాజు వారసుడి ఫోటో నెట్టింట లీక్‌ అయ్యింది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ దిల్‌రాజు కొడుకును ఎత్తుకున్న ఓ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వంశీ పైడిపల్లి దర్శక్తవం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ క్రమంలో దిల్‌రాజు ఇంటికి వచ్చిన విజయ్‌ ఆయన కొడుకును ఎత్తుకొని ఆడించారు.

ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు క్యూట్‌ అంటూ కామెంట్స​ చేస్తున్నారు. కాగా భారీ బడ్జెట్‌తో నిర్మాస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement