Green Saree
-
చీరలో చూడముచ్చటగా సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ (ఫోటోలు)
-
మత్తెక్కించేలా చీరలో నయనతార సోయగాలు (ఫొటోలు)
-
బుల్లితెర భామ తేజస్విని గౌడ స్మైలీ లుక్స్.. ఫోటోలు
-
నిండు గర్భిణి దీపిక వినాయకుని ఆశీస్సులు, ఆ చీర రహస్యం!
గణేష్ చతుర్థి 2024 కోసం బాలీవుడ్ హీరోయిన్, త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొణె ఆమె భర్త రణవీర్ సింగ్తో కలిసి ధరించిన ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. రణవీర్ , దీపిక జంట మొత్తం కుటుంబంతో కలిసి రావడం విశేషం. పుట్టబోయే బిడ్డ కోసం గణనాథుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిండు గర్భిణీ దీపిక బనారసీ చీరలో హుందాగా కనిపించింది. దీపికా ఫ్యాషన్ బీట్ను మిస్ చేయదు అంటూ అభిమానులు కమెంట్ చేశారు. అయితే ఈ చేనేత చీర వెనుక పెద్ద కథే ఉందట.సెలబ్రిటీ స్ట్టౖౖెలిస్ట్ అనితా ష్రాఫ్ అదాజానియా 9 గజాల ఈ చీరను దీపికాకు బహూకరించారట. ఈ బనారసి చీరను ఎత్నిక్ వేర్ బ్రాండ్ బనారసి బైఠక్ కోసం రూపొందించారు. వంద సంవత్సరాల నాటి డిజైన్ ప్రేరణతో బనారసి థ్రెడ్వర్క్తో, మ్యూజ్, ఒరిజినల్ డిజైన్, కలర్ ప్యాటర్న్ను తీసుకున్నారు. అయితే చీర మరీ బరువు కాకుండా చీర, కాస్త తేలిగ్గా ఉండేలా బూటాల మధ్య ఉన్న దాన్ని మాత్రమే తొలగించారు. దీని తయారీ కోసం ఆరు నెలలు పట్టింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) కాగా దీపికా,రణవీర్ , 2018, నవంబరు 14న వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా సెప్టెంబర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ పిల్లల బట్టలు, బూట్లు . బెలూన్లతో శుభవార్తను ఫ్యాన్స్తో పంచుకున్న సంగతి తెలిసిందే. -
Srinidhi Shetty: చీరలో నన్ను మిస్ అయ్యారా? అంటూ ఫోటోలు షేర్ చేసిన శ్రీనిధి శెట్టి
-
Samyuktha Menon: శారీలో అలా.. హారంతో ఇలా.. బింబిసార హీరోయిన్ లుక్స్ చూశారా?
-
Anasuya Bharadwaj: ఆరడుగుల సీతాకోకచిలుకలా యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
‘ఆకులో ఆకునై’ మట్టి కుస్తీ సుందరిని గుర్తు పట్టారా? (ఫోటోలు)
-
అంచు పట్టు
► కొమ్మ చివరనే విరిసే పువ్వులు...మాను చివరనే మామిడి పిందెలు ► చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అవి ఎలాగో... ► పట్టు చీరకే జరీ జిలుగులు... చీర అంచునే వెలుగుల రేకలు. ఇవీ అలాగ!! ఆకుపచ్చని చీరంతా బంగారు పువ్వుల కాంతి. రెండు అంచెలుగా ఆకట్టుకునే పెద్ద అంచు. ఆ అంచు మీద మాటలకుఅందని వైభవం ఈ చీర సింగారం.వంగపండు, ఆకుపచ్చ కాంబినేషన్లతో చూపు తిప్పుకోనివ్వని విధంగా రూపుదిద్దుకున్నది ఈ పట్టుచీర. పెద్ద అంచు మీద ఎరుపు రంగు డిజైన్లలో కనువిందు చేస్తున్న నెమళ్ల అందం వర్ణనాతీతం. చీరంతా వచ్చిన జరీ బుటా ప్రత్యేక ఆకర్షణ.వినీలాకాశానికి బంగారు రంగు అద్దితే వచ్చే అందం ఈ పట్టుచీర సొంతం. బంగారు జరీ జిలుగులతో చీరంతా బుటా, జరీ అంచుతో మెరిసి పోతున్న ఈ పట్టుచీర వేడుకలో ఓ ప్రత్యేక ఆకర్షణ. పర్పుల్ కలర్ చీరపై మామిడి పిందెల డిజైన్ కళ్లను కట్టిపడేస్తుంటే మరో వైపు పెద్దంచు జరీ మెరుపు అబ్బురపరుస్తుంది. నీలిరంగు పల్లూ ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతుంది.ఎరుపు రంగు పట్టు చీర వేడుకలో ఎప్పుడూ ఎవర్గ్రీన్గానే నిలుస్తుంది. చీరంతా బంగారువర్ణంతో అద్భుతంగా మెరిసిపోతుంది. సింపుల్ డిజైన్ అనిపిస్తూనే గ్రాండ్లుక్తో వెలిగిపోతున్న పల్లూ, పెద్ద జరీ అంచు ఈ చీరకు అదనపు హంగుగా అమరాయి.