Alia Bhatt Baby Bump Photos Leaked From Heart of Stone Movie Shooting - Sakshi
Sakshi News home page

Alia Bhatt Baby Bump Photos: బేబీ బంప్‌తో అలియా భట్‌ !.. లీకైన ఫొటోలు..

Published Sat, Jul 9 2022 8:41 PM | Last Updated on Sat, Jul 9 2022 9:06 PM

Alia Bhatt Baby Bump Photos Leaked From Heart Of Stone Movie Shooting - Sakshi

Alia Bhatt Baby Bump Photos Leaked: ఆరేళ్లు ప్రేమలో మునిగి తేలిన బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్ ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌లు ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎప్రీల్‌ 14న ఇరు కటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. ఇక పెళ్లయిన 2 నెలలకే ఆలియా ప్రెగ్నెన్సీని ప్రకటించి ఫ్యాన్స్‌కు శుభవార్త అందించింది. అయితే ఈ ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇవ్వకుండా కమిట్‌మెంట్‌ ఇచ్చిన సినిమాలు చేస్తొంది అలియా భట్‌. ఇక హాలీవుడ్‌ మూవీ 'హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌'లో అలియా నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఇటీవల అలియాకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. అయితే ఇంతకుముందు పోర్చ్‌గల్‌లోని ఎడారిలో షూటింగ్‌ చేసినప్పుడు కొంతమంది ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ లీకైన ఫొటోలలో అలియా భట్‌ బేబీ బంప్‌ స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. తాజాగా పోర్చ్‌గల్‌కు సంబంధించిన షూటింగ్‌ ఫొటోలను అలియా భట్ షేర్‌ చేసింది. ఇందులో కూడా అలియా భట్ ప్రెగ్నెన్సీ కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఈ ఫొటోల్లో తన బేబీ బంప్‌ కవర్‌ అయ్యేలా అలియా బ్లాక్‌ జాకెట్‌ ధరించిందని కామెంట్లు పెడుతున్నారు. షూటింగ్‌ పూర్తియిన సందర్భంగా హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ చిత్రబృందానికి అలియా భట్ థ్యాంక్స్‌ చెప్పింది. హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ గాల్‌ గాడోట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement