Watch: Alia Bhatt Teaches Telugu To Gal Gadot - Sakshi
Sakshi News home page

Alia Bhatt Gal Gadot: 'వండర్ ఉమన్' తెలుగులో మాట్లాడితే?

Published Tue, Aug 8 2023 1:59 PM | Last Updated on Tue, Aug 8 2023 2:26 PM

Actress Alia Bhatt Telugu Gal Gadot Learn - Sakshi

హాలీవుడ్ స్టార్స్ తెలుగులో మాట్లాడారు. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్ ఆలియా భట్ వాళ్లకు తెలుగు నేర్పించింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. అసలు ఆలియా వాళ్లకు ఎందుకు, ఏం నేర్పిందనేగా మీ డౌట్. అక్కడికే వచ్చేస్తున్నా. అలా సరదాగా ఏం మాట్లాడుకున్నారో కూడా చెప్పుకుందాం.

(ఇదీ చదవండి: నటుడిగా పనికిరాడన‍్నారు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు!)

బాలీవుడ్ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఆలియా.. పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకుంది. రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో సీతగా నటించి ఆకట్టుకుంది. ఇక ఆలియా నటించిన హాలీవుడ్ మూవీ 'హార్ట్ ఆఫ్ స్టోన్' రిలీజ్‌కి రెడీగా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఫన్నీ ఇంటర్వ్యూ జరిగింది.

ఈ వీడియోలా ఆలియా భట్ కి తోడుగా గల్ గడాట్, జెమీ డోర్నర్ పలు విషయాలు మాట్లాడారు. అదే టైంలో ఆలియా భట్ తనకు తెలిసిన రెండు తెలుగు మాటల్ని సదరు హాలీవుడ్ స్టార్స్ తోనూ చెప్పించింది. 'అందరికీ నమస్కారం', 'మీకు నా ముద్దులు' అని ఇంగ్లీష్ యాక్టర్స్ చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ అంతే ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆలియాకి వచ్చిందే రెండు ముక్కలు.. వాటినే మళ్లీ నేర్పిస్తోంది అని అంటున్నారు.

(ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement