Alia Bhatt Reveals Why She Was Done Heart Of Stone Movie During Pregnancy - Sakshi
Sakshi News home page

Alia Bhatt: ప్రెగ్నెంట్‌ అని తెలిసినా ఆ పని చేశా

Published Sun, Jun 25 2023 11:36 AM | Last Updated on Sun, Jun 25 2023 12:11 PM

Alia Bhatt Reveals Why She Was Done Heart Of Stone Movie During Pregnancy - Sakshi

వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్‌. తాజాగా ఈ బ్యూటీ హాలీవుడ్‌లోనూ తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధమైంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’మూవీతో ఈ భామ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా.. ఈ మూవీ షూటింగ్‌ అనుభవాలు పంచుకుంది.

‘గతేడాది ఏప్రీల్‌లో రణ్‌బీర్‌తో నా పెళ్లి అయిన వెంటనే ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ షూటింగ్‌ ప్రారంభమైంది. అదే ఏడాది జూన్‌లో నేను గర్భం దాల్చాను. అయినప్పటికీ షూటింగ్‌లో పాల్గొన్నాను. షూటింగ్‌ మొత్తం అయ్యాక..కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాకపోవడంతో వాటిని మళ్ళీ రీషూట్‌ చెయ్యాలి అన్నారు. అప్పటికే నేను ప్రెగ్నెంట్‌. కానీ ఈ విషయం చెప్పకుండా షూటింగ్‌లో పాల్గొన్నాను.

(చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!)

అయితే కొంతమంది మాత్రం నా బేబీ బంప్‌ని గుర్తించారు. ఆ తర్వాత సులభంగా చీత్రీకరణలో పాల్గొన్నాను. షూటింగ్‌ సమయంలో చిత్రబృందం నాకు చాలా సౌకర్యాలు కల్పించింది. అందుకే ప్రెగ్నెంట్‌ అయినా సులభతరంగా షూటింగ్‌ పూర్తి చేశా. ఇది నా మొదటి హాలీవుడ్‌ మూవీ.అందుకే వదులుకోకూడదని ప్రెగ్నెంట్ అని తెలిసినా సినిమా చేశాను’అని అలియా చెప్పుకొచ్చింది.

కాగా గతేడాది ఏప్రిల్‌లో స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌తో అలియా పెళ్లి అయింది. ఆ తర్వాత రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్‌ అని ప్రకటించింది. అదే ఏడాది నవంబర్‌లో ఓ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement