లేటెస్ట్‌ బేబీ బంప్‌ ఫొటోలు షేర్‌ చేసిన కాజల్‌ | Kajal Aggarwal Shares Her Latest Baby Bump Photos In Yellow Dress | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: లేటెస్ట్‌ బేబీ బంప్‌ ఫొటోలు షేర్‌ చేసిన కాజల్‌

Published Mon, Feb 7 2022 6:18 PM | Last Updated on Mon, Feb 7 2022 7:17 PM

Kajal Aggarwal Shares Her Latest Baby Bump Photos In Yellow Dress - Sakshi

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్‌ సందర్భంగా కాజల్‌ తల్లి కాబోతున్న విషయాన్ని ఆమె భర్త గౌతమ్‌ కిచ్లు అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశాడు. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ గర్భవతి మహిళ ఎమోజీని క్యాప్షన్‌తో ఓ ఫొటోను షేర్‌ చేశాడు. దీంతో ఆమె ఫ్యాన్స్‌ కాజల్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి: రూ. 200 కోట్లకు పైగా లతా ఆస్తులు ఎవరికి? వీలునామాలో ఏం ఉంది..

ఈ  నేపథ్యంలో కాజల్‌ తన తాజా బేబీ బంప్‌ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో కాజల్‌ ఎల్లో కలర్‌ డ్రెస్‌లో ‘చందమామ’లా మెరిసిపోయింది. ఇంటి బాల్కానీలో నిలబడి సన్‌రైజ్‌ను ఆస్వాదిస్తున్న కాజల్‌ ఈ ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘సూర్యుని కిరణాలు నా ముఖాన్ని మృదువుగా తాగుతున్నప్పుడు’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలో కాజల్‌ బేబీ బంప్‌తో కనిపించింది.

చదవండి: అషురెడ్డి రచ్చ, ఫోన్‌ నెంబర్‌ షేర్‌ చేయడంతో దిగొచ్చిన నెటిజన్‌..

ఇక త్వరలోనే కాజల్‌ మరో శుభవార్త చెప్పనుందంటూ ఆమె ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా గతంలో తన ప్రెగ్నీన్సీపై వార్తలు వచ్చినా కాజల్‌ మాత్రం తన బేబీ బంప్‌ను కవర్‌ చేస్తుండేది. కానీ న్యూయర్‌లో భర్త గౌతం ఈ విషయాన్ని వెల్లడించడంతో కాజల్‌ భర్తతో దిగిన ఓ ఫోటోను షేర్‌చేస్తూ 2022 అంటూ లవ్‌ సింబల్‌ను యాడ్‌ చేసింది. ఈ ఫోటోలో కాజల్‌ తన బేబీ బంప్‌ స్పష్టంగా కనిపించేలా చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement