
Kajal Aggarwal With Baby Bump Photos Goes Viral: నందమూరి కళ్యాణ్ రామ్ ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో హీరోయిన్‌గా పరిచమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించి అందం, అభినయంతో అందరి కుర్రకారు మనసు దోచేసింది ఈ పంజాబీ భామ. అలా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన కాజల్ గతేడాది అక్టోబర్ 30న తన చిరకాల మిత్రుడు, ముంబై వ్యాపావేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి అనంతరం కాజల్ సినిమా షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త కొత్తకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
చదవండి: ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్, ఎట్టకేలకు స్పందించిన సమంత
కాజల్ గర్భం దాల్చిందని, త్వరలోనే ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పనుందంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై ఇంతవరకు కాజల్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో దీనిపై ప్రశ్న ఎదురవగా.. సమయం వచ్చినప్పుడు స్పందిస్తానంటూ మాట దాటేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను నెటిజన్లు పట్టేసి వైరల్ చేస్తున్నారు. తన స్నేహితులతో కలిసి సదరగా దీగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది కాజల్. ఇందులో కాజల్ కాస్తా బేబీ బంప్ ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆమె నిజంగానే గర్భం దాల్చిందని, అయితే త్వరలోనే ఫ్యాన్స్ శుభావార్త చెప్పనుందట అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై కాజల్ ఎలా సందించనుంది, దీనిపై క్లారిటీ ఎలా ఇవ్వనుందో వేచి చూడాలి.
చదవండి: షాకింగ్.. ప్రముఖ టాలీవుడ్ నటి హంసానందినికి క్యాన్సర్, గ్రేడ్-3 స్టేజ్