బేబీ బంప్‌ ఫొటోలు షేర్‌ చేసి షాకిచ్చిన హీరోయిన్‌, ఫొటోలు వైరల్‌ | Nithya Menon Shares Baby Bump Photos Goes Viral From Behind the Scene | Sakshi
Sakshi News home page

Nithya Menon: బేబీ బంప్‌తో నిత్యా మీనన్‌! ఫొటోలు వైరల్‌

Published Sat, Nov 19 2022 11:18 AM | Last Updated on Sat, Nov 19 2022 12:36 PM

Nithya Menon Shares Baby Bump Photos Goes Viral From Behind the Scene - Sakshi

హీరోయిన్‌ నిత్యా మీనన్‌ వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూ.. పాత్రలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది. అలా సక్సెస్‌తో కెరీర్‌లో దూసుకుపోతోంది నిత్యా మీనన్‌. ఇక ఈ ఏడాది స్కైలాబ్, భీమ్లానాయక్ వంటి చిత్రాలతో అలరించిన నిత్యా.. నటిగానే కాదు సింగర్‌గా కూడా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్‌ పాత్రలు పక్కన పెట్టి కేవలం కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేస్తోంది. ఇదిలా ఉందే తాజాగా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది.

చదవండి: తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన హీరోయిన్‌

కొద్ది రోజులుగా ఆమె సోషల్‌ మీడియాలో షాకింగ్‌ పోస్ట్స్‌ షేర్‌ చేస్తూ వస్తోంది. ఇటీవల ప్రెగ్నెన్సీ కిట్‌ ఫొటో ఒకటి షేర్‌ చేసి అందరిని డైలామాలో పడేసింది. దీంతో నిత్యా ప్రెగ్నెంటా? అని ఆమె ఫాలోవర్స్‌ అంతా సందేహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియో పోస్ట్‌ చేసింది.. ఇప్పుడు ఏకంగా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను పంచుకుంది. అయితే ఇదంత తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ప్రమోషన్లో భాగంగా అని తెలుస్తోంది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘ప్రెగ్నెన్సీ ఎప్పుడూ అందంగా కనిపించదు.

చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్‌, నడవలేని స్థితిలో..

కానీ నోరాగా పాత్ర పోషించడం నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని మంచి ఫొటోలను షేర్‌ చేస్తాను’ అంటూ ఇవి తెర వెనుక తీసిన ఫొటోలు అంటూ చెప్పుకొచ్చింది. ఇక చివరగా ‘గమనిక: నేను నిజంగా ప్రెగ్నెంట్‌ కాదు’ అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఏదేమైన నిత్యా తీరు చూసి ఆమె ఫాలోవర్స్‌ అంతా ఖంగుతింటున్నారు. తరచూ ఆమె ప్రెగ్నెంట్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు పోస్ట్‌ చేసి షాకిస్తోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొదట ఆమె ఫొటోలు చూసి షాకవుతున్నప్పటికీ.. ఆ తర్వాత నోట్‌ చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్‌. దీంతో ఆమె పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశమైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement