‘సొంతం’, ‘జెమిని’, 'బిల్లా' ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నమిత. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తన బర్త్‌డే రోజు (మే 10) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అంతేకాదు ఇటీవల నమిత సీమంతం కూడా ఘనం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది కూడా. అంతేకాదు భర్తతో కలిసి బేబీ బంప్ ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చిన ఫొటోలను సైతం ఫాలోవర్స్, ఫ్యాన్స్‌తో పంచుకుంది.
చదవండి: బన్నీ షాకింగ్ లుక్ వైరల్, ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు
ఇక తాజాగా తన బేబీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. అయితే ప్రస్తుతం నమిత 9 నెలల గర్భవతిగా ఉంది. త్వరలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో 9 నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఫొటోషూట్‌ను తాజాగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తాజాగా షేర్ చేసింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘కమ్మింగ్ సూన్’ అంటూ తన ఫొటోషూట్‌ను పోస్ట్ చేసింది. కాగా 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరిగింది.
చదవండి: తల్లి కాబోతున్న ఆలియా.. నీతూ కపూర్ రియాక్షన్ చూశారా!
Comments
Please login to add a commentAdd a comment