తల్లి కాబోతున్న టాలీవుడ్‌ హీరోయిన్! | Okariki Okaru Telugu Movie Actress Aarti Chabria Flaunts Baby Bump | Sakshi
Sakshi News home page

తల్లి కాబోతున్న హీరోయిన్.. తెలుగులో అదే చివరి సినిమా!

Apr 3 2024 9:46 PM | Updated on Apr 4 2024 1:00 PM

Okariki Okaru Telugu Movie Actress Aarti Chabria Flaunts Baby Bump - Sakshi

బాలీవుడ్ భామ ఆర్తి చాబ్రియా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. తాజాగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వార్తను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆర్తి చాబ్రియాకు విషెస్ చెబుతున్నారు.  కాగా.. ఆస్ట్రేలియాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్‌ విశారద్ బీదాస్సీని 2019లో వివాహం చేసుకుంది.

కాగా.. ఆర్తి చాబ్రియా బాలీవుడ్‌లో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, తుమ్సే అచ్చా కౌన్ హై, షాదీ నంబర్ 1 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చాబ్రియా చివరిసారిగా 2013లో విడుదలైన పంజాబీ చిత్రం వ్యాహ్ 70 కిమీలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్‌లో మధుర క్షణం, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాలు చేసింది. చింతకాయల రవి మూవీలో ఐటం సాంగ్‌లో మెరిసింది. తెలుగులో చివరగా గోపి గోడ మీద పిల్లి చిత్రంలో నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement