Naveen Chandra is going to become father soon, shares wife baby bump pics - Sakshi
Sakshi News home page

Naveen Chandra :తండ్రి కాబోతున్న నటుడు నవీన్‌ చంద్ర.. ఫోటోలు వైరల్‌

Published Tue, Feb 14 2023 3:29 PM | Last Updated on Tue, Feb 14 2023 4:16 PM

Naveen Chandra Will Become Father Soon Shares Wife Baby Bump Pics - Sakshi

టాలీవుడ్‌ నటుడు నవీన్‌ చంద్ర అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు రివీల్‌ చేశాడు. వలైంటైన్స్‌ డే సందర్భంగా ఈ స్పెషల్‌ న్యూస్‌ను నెటిజన్లతో షేర్‌ చేస్తూ.. బేబీ మూన్.. నా చేతుల్లోకి నిన్ను ఎప్పుడెప్పుడు తీసుకుని ముద్దాడుతానా అని ఎదురుచూస్తున్నా. పేరెంట్స్‌గా ప్రమోట్‌ అవుతున్నందుకు చాలా గొప్పగా ఉంది. కొత్త జీవితం, కొత్త ప్రయాణం అంటూ భార్య బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేశాడు.

ఇది చూసిన పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి నవీన్‌ చంద్ర దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ‘అందాల రాక్షసి’ మూవీతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ప్రస్తుతం సహాయక పాత్రలతో పాటు విలన్‌ రోల్స్‌లో కూడా అలరిస్తున్నాడు.ఇటీవల విరాటపర్వం, రంగరంగ వైభవంగా, అమ్ము, రిపీట్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement