Shriya Saran Shares Her Baby Bump Dance Video: హీరోయిన్ శ్రియ సరన్ బేబీబంప్‌తో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది చూసి శ్రియా మళ్లీ ప్రెగ్నెంటా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది తన పాత వీడియో. తన గర్భవతి అయిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన శ్రియా గతేడాది అక్టోబర్‌లో కూతురు పుట్టిందని ప్రకటించి ఒక్కసారిగా అందరికి షాకిచ్చింది. అక్టోబర్ 11న తొమ్మిది నెలల క్రితం తనకు ఆడపిల్ల పుట్టిందని, తన కూతురు పేరు రాధ అని వెల్లడించిన సంగతి తెలిసిందే.
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు
దీంతో జీవితంలో అంత్యంత ఆనందకరమైన విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అందరు ఆమెపై మండిపడ్డారు. అంతేకాదు సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని కూడా చాలా లేటుగా ప్రకటించిందని ఆసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా శ్రియా 2020 బ్యాక్ అంటూ బేబీబంప్‌తో నాట్యం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఇది చూసి అంతా షాక్ అయినా.. ఆ తర్వాత ఇది పాత వీడియో అని గుర్తించారు. దీంతో ఆమె వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే మొదటి లాక్డౌన్ సమయంలో శ్రియ గర్భవతి అయిన ఆమె ఈ విషయం మీడియాకు లీక్ అవకుండా జాగ్రత్త పడింది.
https://t.co/N9naSuJYSJ#ShriyaSaran Shares Her Pregnancy Time Video | Shriya Saran BABY BUMP Video | #Shriya #Tollywood #tollywoodactress
— Filmylooks (@filmylooks) April 18, 2022
చదవండి: ఆ హీరోయిన్‌తో నటించాలనుంది : యశ్
‘గమనం’ సినిమా ప్రమోషన్స్‌లో తన భర్త, పాపతో ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. ఆమె మాతృత్వ మధురిమల్ని ఆస్వాదిస్తున్నట్లు వివరించింది. ఇక ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌లో కనిపించిన శ్రియా తన తాజా చిత్రం మ్యూజిక్ స్కూల్ షూటింగ్‌తో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతుంది. కాగా 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన శ్రియ.. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment