
హిందీ బిగ్ బాస్ 16తో ఫేమస్ అయిన ప్రముఖ సింగర్ అబ్ధు రోజిక్ సంచలన విషయాన్ని ప్రకటించాడు. షార్జాకు చెందిన అమీరాతో త్వరలోనే పెళ్లి అని అట్టహాసంగా ప్రకటించిన అబ్ధుల్ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు తాజాగా వెల్లడించాడు. దీంతో ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నిర్ణయంతో షాక్ అయ్యారు.
అబ్దు అమీరా ఏప్రిల్ 24, 2024న దుబాయ్‌లోని మజ్లిస్ షార్జాలో విలాసవంతమైన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 7న జరగాల్సిన వీరి పెళ్లి చేసుకోబోతున్నామని కూడా ప్రకటించారు. కానీ అబ్దు బాక్సింగ్ మ్యాచ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ జంట ఇప్పుడు విడిపోవడానికి నిర్ణయించు కున్నారు. తమ సాంస్కృతిక విభేదాలే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఈ నిర్ణయం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన వ్యక్తిగత ఎదుగుదలకు ఇది అవసరమని పేర్కొన్నాడు. అందరూ అర్థం చేసుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు సమయం వచ్చినప్పుడు ప్రేమ తనను వెతుక్కుంటూ వస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. (డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్)
కాగా తజికిస్థాన్ సింగర్ అయిన అబ్దు రోజిక్ తన సాంగ్స్‌తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత బిగ్ బాస్ 16 ద్వార ఒక రేంజ్‌లో క్రేజ్ సంపాదించాడు. సంగీత కెరీర్ ద్వారా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మే 9న ఇన్‌స్టాగ్రామ్‌లో తన నిశ్చితార్థ వేడుక చిత్రాలను కూడా పంచుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపరిచాడు. అమీరా-అబ్దు పెళ్లికి సల్మాన్ ఖాన్, నే-యో, ర్యాన్ గార్సియా, జాసన్ డెరులో, మైక్ టైసన్ లాంటి టాప్ సెలబ్రిటీలు రానున్నారని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా విడిపోతున్నట్టు ప్రకటించారు. విభేదల పరిష్కారానికి ప్రయత్నాలు ఉన్నప్పటికీ, వారు చివరికి విడిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతానికి, అబ్దుతన వ్యక్తిగత, ,వృత్తిపరమైన ఎదుగుదలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ
వింత ఉద్యోగం: పెళ్లిళ్లు చెడగొట్టడమే పని, భారీ ఆదాయం కూడా!
Comments
Please login to add a commentAdd a comment