బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్! | Devoleena Bhattacharjee SLAMS Bigg Boss OTT 3 Armaan Malik And His Wives | Sakshi
Sakshi News home page

Devoleena Bhattacharjee: ఇద్దరు భార్యలతో బిగ్‌బాస్‌లోకి.. ఇదేం దరిద్రం?

Published Sun, Jun 23 2024 5:10 PM | Last Updated on Sun, Jun 23 2024 6:56 PM

Devoleena Bhattacharjee SLAMS Bigg Boss OTT 3 Armaan Malik with His Wives

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఉన్న క్రేజే వేరు. ఏ భాషలో అయినా ఈ షో సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. తాజాగా హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ -3 ప్రారంభమైంది. ఈ షోలోకి పలువురు కంటెస్టెంట్స్‌ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో ప్రముఖ యూట్యూబర్‌ ఆర్మాన్ మాలిక్‌పైనే అందరిదృష్టి పడింది. ఎందుకంటే అతను తన ఇద్దరు భార్యలు పాయల్, కృతికతో కలిసి హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆర్మాన్‌తో వారి ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అయితే ఇది చూసిన మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ దేవోలీనా భట్టాచార్జీ విమర్శలు గుప్పించింది. వీరిని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని పేర్కొంది. అసలు ఇది వినోదం కోసం తీసుకొచ్చిన షోలా లేదని మండిపడింది. రియాలిటీ షో ద్వారా బహుభార్యత్వాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన ట్విటర్‌లో రాసుకొచ్చింది.

దేవోలీనా తన ట్విటర్‌లో రాస్తూ..' ఇదేంటి వినోదం అని మీరు అనుకుంటున్నారా? దీన్ని ఎలా పిలుస్తారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి వాటి గురించి వినగానే నాకు అసహ్యం అనిపిస్తోంది. బిగ్ బాస్ మీకేమైంది? బహుభార్యత్వంతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటున్నారా? ఈ షోను చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరు వీక్షిస్తున్నారు. ఇలాంటి వాటితో మీరు కొత్త తరానికి ఏమి నేర్పించాలనుకుంటున్నారు? వీరిని చూసిన అందరూ 2, 3, 4 వివాహాలు చేసుకోవచ్చా? అందరూ కలిసి సంతోషంగా జీవించగలరా? రోజు ఇలాంటి సంఘటనలతో బాధపడుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారిని వెళ్లి అడగండి.' ‍‍అని చురకలు అంటించింది.

'అందుకే దేశంలో ప్రత్యేక వివాహ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. చట్టం అందరికీ ఒకటే.‍ అప్పుడే ఈ సమాజం ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందుతుంది. మొదటి భార్య ఉండగా రెండో భార్య. ఒకవేళ భార్యలు కూడా ఇద్దరు భర్తలను కలిగి ఉంటే..  మీరు చూస్తూ కాలక్షేపం చేస్తారా? అని ప్రశ్నించింది. ఇలాంటి వాళ్లను ఏ కారణంతో ఫాలో అవుతారు? కొత్త తరానికి బహుళ వివాహాలు చేసుకోవాలని ఈ షో ద్వారా నేర్పిస్తున్నారా? ఇది తలచుకుంటేనే భయమేస్తోంది. ' అని రాసుకొచ్చింది.

అంతేకాకుండా.. 'మీకు 2-3 పెళ్లిళ్లు చేసుకోవడం అంత అవసరం అయితే చేసుకుని ఇంట్లోనే ఉండండి. మీ నీచమైన మనస్తత్వాన్ని ప్రపంచానికి చూపకండి. ఇలాంటి వాటితో సమాజం విధ్వంసం వైపు వెళ్తుంది. మరి బిగ్ బాస్.. మీకు ఏమైందో నాకు తెలియడం లేదు' అంటూ ట్విటర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చూసిన నెటిజన్స్‌ దేవోలీనాను ప్రశంసిస్తున్నారు. ఆ ముగ్గురిని రియాల్టీ షోలోకి తీసుకొచ్చినందుకు  బిగ్ బాస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా.. ఈ రియాలీటి షోకు అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్‌ ఓటీటీ సీజన్-3 జియో సినిమాలో ప్రసారమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement