పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే | Bigg Boss 16 Abdu Rozik Wedding Postponed; Here Reason | Sakshi
Sakshi News home page

Abdu Rozik: మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ఇప్పుడేమో వాయిదా వేస్తున్నట్లు ప్రకటన

Published Tue, Jun 11 2024 5:22 PM | Last Updated on Tue, Jun 11 2024 5:42 PM

Bigg Boss 16 Abdu Rozik Wedding Postponed Reason Details

బిగ్ బాస్ రియాలిటీ షోతో చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. అలా హిందీలో 16వ సీజన్‌లో పాల్గొన్న మరగుజ్జు తజికిస్థాన్ సింగర్ అబ్దు రోజిక్ కూడా చాలా ఫేమ్ సొంతం చేసుకున్నాడు. తనదైన పాటలు, కామెడీ టైమింగ్‌తో ఎంటర్ టైన్ చేస్తున్నాడు. 20 ఏళ్ల అబ్దు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో దుబాయికి చెందిన ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చాడు. జూలైలో పెళ్లి ఉంటుందని చెప్పాడు. కానీ ఇప్పుడు దాన్ని వాయిదా వేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాజు యాదవ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

20 ఏళ్ల అబ్దు రోజిక్.. షార్జాకు చెందిన అమీరాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. జూలై 7న నిఖా(ముస్లిం పద్ధతిలో పెళ్లి) చేసుకుంటానని సోషల్ మీడియాలో ప్రకటించాడు. కానీ ఇప్పుడీ వేడుక కాస్త అబ్దు.. బాక్సింగ్ మ్యాచ్ వల్ల వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే రివీల్ చేశాడు. జూలై 6న బాక్సింగ్ టైటిల్ కోసం పోటీ పడే మ్యాచులో ఛాన్స్ వచ్చిందని, ఇందులో పాల్గొంటే చాలా డబ్బు వస్తుందని, తనకు ఇది ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పాడు.

అసలు బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేసే ఛాన్స్ వస్తుందని ఊహించలేదని చెప్పిన అబ్దు.. ఈ ఏడాది తన జీవితంలో చాలా మంచి విషయాలు జరిగాయని వాటిలో ఇదొకటి అని అన్నాడు. అయితే అనుకోని విధంగా బాక్సింగ్ మ్యాచ్ కోసం నిఖా వాయిదా వేసుకోక తప్పట్లేదని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ట్రైలర్.. ఆ విషయంపై ట్రోల్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement