
పట్నా : మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలకు బిహార్ సిద్ధమైంది. చివరి దశలో మొత్తం 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ ప్రారంభమైంది. తుది దశలో మెత్తం 2కోట్ల 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఘాటు వ్యాక్యాలు చేశారు. మరోసారి నితీష్ సీఎం కాలేరని వ్యాఖ్యానించారు. తాను సాధారణ స్థాయి నుంచి వచ్చి పనిచేశానని, పార్టీ కోసం ఒంటరిగా కృషి చేస్తున్నానని అన్నారు. గడిచిన రెండు దశల ఎన్నికలను పరిశీలిస్తే నితీష్ కుమార్ మరలా ముఖ్యమంత్రి కారని అన్నారు. రాబోయే ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెడుతుందని, ప్రతి ఒక్కరికీ దీని గూర్చి తేలియజేయాలనుకుంటున్నానని తెలిపారు. ఓటర్లు అంతా ముందుకు వచ్చి ఓటు వేయాలని నేను కోరారు. గత 15 సంవత్సరాల కంటే బిహార్ రాబోయే ఐదేళ్ళు మెరుగ్గా ఉండటానికి ఇదే అవకాశమని ఆయన అన్నారు .
Comments
Please login to add a commentAdd a comment