
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు దేశం అనుసరిస్తున్న లాక్ డౌన్ కొత్త నైపుణ్యాలను బయటపెడుతోంది. తాజాగా కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌కు ఆయన కొడుకు, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఆదివారం క్షవరం చేసి ఎలక్ట్రిక్ ట్రిమ్మర్‌తో ట్రిమ్మింగ్ చేస్తున్న వీడియోను చిరాగ్ ట్వీట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.