union minister Ram Vilas Paswan
-
తండ్రికి కొడుకు క్షవరం
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు దేశం అనుసరిస్తున్న లాక్ డౌన్ కొత్త నైపుణ్యాలను బయటపెడుతోంది. తాజాగా కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌కు ఆయన కొడుకు, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఆదివారం క్షవరం చేసి ఎలక్ట్రిక్ ట్రిమ్మర్‌తో ట్రిమ్మింగ్ చేస్తున్న వీడియోను చిరాగ్ ట్వీట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. -
చైనా, ఈజిప్టు నుంచి ఉల్లి దిగుమతి
ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్రమంత్రి పాశ్వాన్ సమాధానం సాక్షిప్రతినిధి, ఖమ్మం: దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన మాట వాస్తవమేనని, అయితే ధరలను నియంత్రించేందుకు చైనా, ఈజిప్టు దేశాల నుంచి 2 వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నామని కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం లోక్‌సభ లో అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధాన మిచ్చారు. ఆహార, వంట నూనెల ఉత్పత్తులు, కూరగాయల ధరల పెరుగుదలకు కారణాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలని పొంగులేటి కోరగా నిత్యావసర వస్తువులు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చూడాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని మంత్రి చెప్పారు. -
ఆప్ కళ్లకు ఉల్లిమంట
న్యూఢిల్లీ: ఉల్లిగడ్డలు ఇప్పుడు వంటింట్లో మంటలు పుట్టించడమే కాదు.. రాజకీయ నేతల కుంపట్లో కూడో మంటలు రాజేస్తున్నాయి. చోటామోటా అని తేడా లేకుండా ఈ అంశాన్ని కూడా తమ ప్రధాన ఎజెండాగా తీసుకుంటూ అధికారంలో ఉన్న పార్టీని అధికారంలో లేని పార్టీలు విమర్శిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉల్లిధరల సెగ తగిలింది. ఉల్లిగడ్డలు స్టాక్ ఉండి కూడా కృత్రిమ కొరత సృష్టించి ధరలు విపరీతంగా పెంచుతున్న వారిపై ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ విమర్శించారు. ఢిల్లీలో కేజీ ఉల్లిధర రూ.80కి పెరిగినా ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, అంటీఅంటనట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. వస్తు సేవల బిల్లు(జీఎస్టీ)ని ఆమోదించడం ద్వారా ఉల్లిగడ్డల ధరలకు కళ్లెం వేయొచ్చని అభిప్రాయపడ్డారు. వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తేరుకొని కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారవేత్తలందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవానికి దేశంలో ఉల్లి కొరత లేదని కావాలనే వ్యాపార వేత్తలు ఇలా చేస్తున్నారని స్పష్టం చేశారు.