చైనా, ఈజిప్టు నుంచి ఉల్లి దిగుమతి
ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్రమంత్రి పాశ్వాన్ సమాధానం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన మాట వాస్తవమేనని, అయితే ధరలను నియంత్రించేందుకు చైనా, ఈజిప్టు దేశాల నుంచి 2 వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నామని కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం లోక్‌సభ లో అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధాన మిచ్చారు. ఆహార, వంట నూనెల ఉత్పత్తులు, కూరగాయల ధరల పెరుగుదలకు కారణాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలని పొంగులేటి కోరగా నిత్యావసర వస్తువులు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చూడాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని మంత్రి చెప్పారు.