Trimming the hair
-
జుట్టు వేగంగా పెరగాలంటే చివర్లు కట్ చేస్తే సరిపోతుందా?
జుట్టును సంరక్షించుకోవడం ఒక సమస్య. ఉన్న జుట్టును మరింత ఆరోగ్యంగా, వేగంగా పెంచుకోవడం మరో సమస్య. ఇందుకు హెయిర్ ప్యాక్ వేసుకోవడం, చుండ్రులేకుండా జాగ్రత్త పడటంతోపాటు, జుట్టు చివర్ల (స్ప్లిట్ ఎండ్స్)ను కట్ చేయడం లాంటివి చేయడం చాలా మంది పాటించే పద్ధతి. అయితే ఇలా చేయడం వల్ల నిజంగా జుట్టు పెరుగుతుందా? అసలు దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.నిజానికి జుట్టు చివర్లు కత్తిరించడం వల్ల అది వేగంగా పెరుగుతుందనే వాదనకు ఎలాంటి ఆధారం లేదు. ఎందుకంటు జుట్టు పెరుగుదల స్కాల్ప్ నుంచి మొదలవుతుంది. కుదుళ్లు బలంగా ఉంటే జుట్టు బలంగా ఉంటుంది. కాబట్టి చనిపోయిన చివర్లను కత్తిరించడం వల్ల అది వేగంగా పెరగదు. కానీ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. స్ప్లిట్ చివర్లు , డ్యామేజ్ అయిన జుట్టును కత్తిరించడం వల్ల, క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు, ఆరోగ్యంగా, ఒత్తుగా కనిపిస్తుంది.ఎన్ని రోజులకోసారి కట్ చేయాలి?సాధారణంగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి అంగుళం మేర కత్తిరించుకోవాలి. ఎంత మేర ట్రిమ్ చేయాలి. ఎన్నిరోజులకు ఒకసారి చేయాలి అనేది ఇది జుట్టు పొడవు, చుండ్రు, జుట్టు చిట్లిపోవడం లాంటి సమస్య బట్టి ఉంటుంది. చాలా మందికి రోజుకు 50-100 వెంట్రుకలు రాలిపోతాయి. అయితే ఈ వెంట్రుకల స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఊడిపోయిన వాటి స్థానంలో కొత్త జుట్టు రావాలంటే సరైన పోషణ అవసరం.జుట్టుకూ ఉండాలి పోషణఅందమైన మెరిసే జుట్టు కావాలంటే పోషణ అవసరం. వారానికి ఒకసారి అయినా కుదుళ్లకు తాకేలా నూనెతో మర్దనా ఉండాలి. తద్వారా హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది. రసాయన రహిత షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉండాలి. బ్లో డ్రైయింగ్ చేయడం, స్ట్రెటియినింగ్ చేయడం, కర్లింగ్ చేయడం లాంటివి తరచుగా చేయకుండా ఉండాలి. ఇవి జుట్టు సహజ మెరుపును, అందాన్ని పాడుచేస్తాయి. నాణ్యమైన హెయిర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. జుట్టు ఆరోగ్యం కోసం ఆహారం ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ ఈ చాలా కీలకం. ఇది బొప్పాయి, బాదం, హాజెల్ నట్స్, అవకాడోస్, దోసకాయ బచ్చలికూర వంటి అనేక పండ్లు , కూరగాయలలో సహజంగా లభిస్తుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి నూనెలు, సాల్మన్ ట్యూనాతో సహా అనేక రకాల చేపలు విటమిన్ ఇ-రిచ్ ఫుడ్స్. ప్రొటీన్ తగ్గడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది. జింక్, సెలేనియం, బయోటిన్ లభించే గుడ్లు తీసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ ,ఫోలేట్లు పుష్కలంగా ఉండే పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఐరన్ లోపం లేకుండా చేసుకోవాలి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం జిడ్డుగా ఉంటే జుట్టును తరచుగా శుభ్రం చేసుకోవాలి. క్లోరిన్ హానికరమైన ప్రభావాలకు దూరంగా ఉండాలి. ఈత కొట్టే స్యంలో జుట్టును కప్పుకోవాలి. ఇంటినుంచి బయటికి వెళ్లినపుడు కాలుష్యం యూవీ కిరణాలనుంచి కాపాడుకునేందుకు స్కార్ఫ్ కట్టుకోవడం, గొడుగు వాడటం ఉత్తమం. -
పెయిన్ లెస్ ఎలక్ట్రిక్ షేవర్.. సాధారణ ట్రిమ్మర్లకు ఇది భిన్నం
చాలామంది ఆడవారు మెచ్చే డ్రెస్ కంఫ్టర్ట్స్లో స్లీవ్‌లెస్ టాపులు.. త్రీ బై ఫోర్త్ ప్యాంట్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇంకాస్త ట్రెండీ లుక్ కోసం బాక్సర్స్, షార్ట్స్ వాడకం కూడా పెరిగింది. దాంతో చేతులు, కాళ్లు, అండర్ ఆర్మ్స్ నూగు లేకుండా నీట్‌గా ఉంచుకునే తాపత్రయమూ ఎక్కువైంది. ఈ క్రమంలో పార్లర్లకు పరుగు తీయడమూ కామన్ అయిపోయింది. అయితే పెయిన్ ఫుల్ వ్యాక్సింగ్ కంటే.. ట్రిమ్మర్ బెటర్ అనే వాళ్ల కోసమే ఈ డివైజ్ (రీచార్జబుల్ హెయిర్ రిమూవర్). ఈ పెయిన్ లెస్ ఎలక్ట్రిక్ షేవర్.. అవాంఛిత రోమాలను పూర్తిగా తొలగించి, చర్మ మృదుత్వాన్ని కాపాడుతుంది. అలాగే నొప్పి తెలియకుండా వెంట్రుకులను తొలగిస్తుంది. శరీరంలో ఎక్కడైనా సరే దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. దాంతో చేతులు, కాళ్లు, అండర్ ఆర్మ్స్, బికినీ లైన్ ఇలా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ చూడటానికి మౌస్లా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. దీని అడుగు భాగంలో నాలుగు ట్రిమ్మింగ్ హెడ్స్ ఉంటాయి. సాధారణ షేవింగ్‌లో మాదిరి చర్మం గరకుగా మారకుండా చూస్తుంది. దీని ధర మూడు వేల రూపాయల పైమాటే. -
తండ్రికి కొడుకు క్షవరం
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు దేశం అనుసరిస్తున్న లాక్ డౌన్ కొత్త నైపుణ్యాలను బయటపెడుతోంది. తాజాగా కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌కు ఆయన కొడుకు, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఆదివారం క్షవరం చేసి ఎలక్ట్రిక్ ట్రిమ్మర్‌తో ట్రిమ్మింగ్ చేస్తున్న వీడియోను చిరాగ్ ట్వీట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. -
వెంట్రుకలకు ట్రిమ్మింగ్ అవసరమే!
జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. ఎండ, కాలుష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్, స్ట్రెయిటనింగ్, కలరింగ్ ... వంటివన్నీ శిరోజాలను దెబ్బతీసేవే! హెయిర్ స్టైలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటాయి. చిట్లిన వెంట్రుకలను బాగుపరచాలన్నా, కళ తప్పని జుట్టుకు జీవం పోయాలన్నా ఈ మేలైన టిప్స్ పాటించాలి.. వారానికి మూడుసార్లు మాత్రమే! షాంపూలో సహజసిద్ధమైన గుణాలు ఉన్నవి ఎంచుకోవాలి. రసాయనాలు ఎక్కువగా ఉన్నవి, ఎక్కువసార్లు షాంపూ వాడటం వంటివి చేస్తే వెంట్రుకలు త్వరగా పొడిబారుతాయి. వారానికి మూడుసార్లకన్నా ఎక్కువగా షాంపూను ఉపయోగించకూడదు. రోజు విడిచి రోజు తలస్నానం చేసినా పర్వాలేదు. అయితే వేడినీటిని తలస్నానానికి ఉపయోగించకపోవడం మేలు. సహజసిద్ధంగానే పొడిగా! జుట్టుకు వేడి ప్రధానమైన శత్రువు. అందుకే తడిగా ఉన్న జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్లు, ప్లాట్ ఐరన్స్ వాడకూడదు. కనీసం వాటిని ఎక్కువసార్లు ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. వేడిని భరించగలిగే హీట్ సిరమ్‌ను ముందుగా జుట్టుకు రాసి, తర్వాత డ్రయ్యర్, స్ట్రెయిటనింగ్ మిషన్స్ వాడాలి. తడి జుట్టును త్వరగా వేడి చేయకుండా చూస్తే వెంట్రుకలు త్వరగా దెబ్బతినడాన్ని నివారించవచ్చు. ట్రిమ్మింగ్! వెంట్రుకలు చిట్లడాన్ని అరికట్టడానికి మంచి పరిష్కారం ట్రిమ్ చేయడం. 6-8 వారాలకు ఒకసారి వెంట్రుకల చివరలను ట్రిమ్ చేయించుకోవాలి. ఇంటి చికిత్స: నూనెతో మర్దన: జుట్టు తేమను అందించాలంటే నూనెతో మసాజ్ చేయడం సరైన పద్ధతి. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనెలను కలిపి మాడుకు పట్టించి, మర్దనా చేయాలి. అరగంట వదిలేసి ఆ తర్వాత ప్రకృతి సిద్ధ గుణాలు ఎక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. గుడ్డుతో: మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టేబుల్‌స్పూన్ తేనె గుడ్డు సొనలో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. బొప్పాయితో: ప్రొటీన్లు ఎక్కువగా గల బొప్పాయి పండును గుజ్జులా చేయాలి. ఈ గుజ్జులో పెరుగు కలిపి తలకు పట్టించాలి. 30 ని.ల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే తేమ కోల్పోయిన వెంట్రుకలకు తిరిగి జీవం లభిస్తుంది. తేనెతో: తలస్నానం చేసిన తర్వాత చాలామంది కండిషనర్ వాడుతుంటారు. దానికి బదులుగా వెంట్రుకలకు కండిషనర్‌లా ఉపయోగపడే కప్పు తేనెలో రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీటిని కలిపి తలకు పట్టించాలి. 15 ని.ల తర్వాత నీటితో కడిగేయాలి.