
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీగా మారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి, కంగనా విజయం సాధించారు. దీంతో ఇప్పుడు మీడియా దృష్టి కంగనాపై నిలిచింది.
లోక్ సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా బుధవారం ఎంపీలంతా పార్లమెంట్‌కు వచ్చారు. ఇదే కోవలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్ సభ మెట్లు ఎక్కగానే మీడియా కెమెరాలు ఆమెను చుట్టుముట్టాయి. ఈ సమయంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా ఆమెకు సమీపంలో కనిపించారు. పార్లమెంట్ మెట్ల మీద వారిద్దరూ కలుసుకుని, నవ్వుతూ పరస్పరం పలుకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్స్ తమ అభిమాన నేతలను చూసి సంబరపడుతున్నారు.
కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ గతంలో ఒక చిత్రంలో కలిసి నటించారు. 2011లో విడుదలైన ‘మిలే నా మిలే హమ్’లో వీరిద్దరూ కనిపించారు. ఈ చిత్రం అంతగా విజయవంతం కాలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఎంపీలుగా మారి రాజకీయాల్లో విజయం సాధించారు. వీరు నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తర్వాత చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ సారధ్యంలో రాజకీయాల వైపు పయనం మొదలుపెట్టారు. 2024లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కంగనా తొలి ఇన్నింగ్స్‌లోనే విజయాన్ని అందుకున్నారు.
#WATCH | Union Minister Chirag Paswan and BJP MP Kangana Ranaut arrive at the Parliament. pic.twitter.com/ZZZk61z7d0
— ANI (@ANI) June 26, 2024