
కుప్పకూలి కిందపడ్డారు
పాట్నా: లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ కిందపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయన కిందపడిపోయారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గయా జిల్లాలో ఆయన ప్రసంగిస్తుండగా స్టేజి కాసేపటికే కూలిపోయింది.
ఈ ఘటనలో చిరాగ్కు ఎలాంటి హాని జరగలేదని జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. వేదిక సామర్ధ్యానికి మించిన గుంపు వేదికపైకి రావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాం కూలిపోయినప్పుడు ఆయనతోపాటు లోక్ సమతా పార్టీ రాష్ట్ర విభాగ చీఫ్ ఎంపీ అరుణ్ కుమార్ ఉన్నారు.