Cabinet Berth
-
మోదీ 3.0.. చిరాగ్‌కు కేబినెట్ బెర్త్ ?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ, జేడీయూలతో పాటు లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్) కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. పోటీ చేసిన ఐదుకు ఐదు సీట్లను గెలుచుకుని ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటడంలో తన వంతు పాత్ర పోషించింది. దీంతో ఎల్జేపీ(రాంవిలాస్) పార్టీ అధినేత చిరాగ్, తన తండ్రి దివంగత ఎల్జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్‌కు అసలు సిసలైన రాజకీయ వారసుడిగా అవతరించారని ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చిరాగ్పాశ్వాన్కు ఒక కేబినెట్ బెర్త్‌తో పాటు బిహార్ రాష్ట్ర కేబినెట్లో పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయనకు ఇప్పటికే బీజేపీ పెద్దలు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనిపై మాట్లాడడానికి చిరాగ్ పాశ్వాన్ నిరాకరించారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది పూర్తిగా ప్రధాని మోదీ నిర్ణయమని చెప్పారు. -
Telangana: పదవుల పందేరం ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్ః రాష్ట్ర మంత్రి మండలిలో కేబినెట్ బెర్త్‌తో పాటు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. శాసనసభ ఎన్నికలు మరో ఏడాది మాత్రమే ఉండటంతో ఖాళీగా ఉన్న కేబినెట్ మంత్రి పదవిపై కన్నేసిన ఆశావహులు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టిలో పడేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, కీలక పదవుల భర్తీ ఉంటుందనే వార్తలు ఎమ్మెలు, నేతలను ఆశలపల్లకిలో విహరింపజేస్తున్నాయి. మెదక్ జిల్లాలో రైతులకు సంబంధించిన భూ ఆక్రమణల ఆరోపణలపై ఈటల రాజేందర్‌ను 2021 మే చివరి వారంలో సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి తప్పించారు. తదనంతర పరిణామాలతో ఈటల బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఆయన నిర్వర్తించిన వైద్యారోగ్య శాఖ బాధ్యతలను ఆర్ధిక మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. ఈటలను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేసి ఏడాదిన్నర గడిచినా ఆయన స్థానంలో కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరినీ తీసుకోలేదు. సంక్రాంతి తర్వాత జనవరి చివరి వారంలో మంత్రివర్గాన్ని పాక్షికంగా పునర్వ్యస్థీకరిస్తారనే ప్రచారం జరుగుతోంది.మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న కేబినెట్ బెర్త్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులను తప్పించి కొత్తవారికి చోటు కల్పిస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పునర్వ్యవస్థీకరణలో కేబినెట్ నుంచి బయటకు వెళ్లేవారు, కొత్తగా చేరేవారు ఎవరనే అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మండలి డిప్యూటీ చైర్మన్ పోస్టు ఎవరికో.. శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌తో పాటు మరో రెండు విప్ పదవులు కూడా దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్నాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డి మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో 2022 మార్చిలో రెండో పర్యాయం మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగకపోవడంతో 2021 జూన్ నుంచి ఖాళీగానే ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ ముదిరాజ్‌కు ఇంకా రెండున్నరేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆయనను ఎమ్మెల్యే కోటాలో సీఎం కేసీఆర్ శాసన మండలికి నామినేట్ చేశారు. దీంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బండా ప్రకాశ్ డిసెంబర్ 2021లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు ఈటల స్థానంలో రాష్ట్ర మంత్రివర్గంలోకి లేదా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి లభిస్తుందనే ప్రచారం జరిగినా ముందుకు సాగలేదు. సుమారు ఏడాదిన్నరగా మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉండటంతో ఆశావహులు కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఖాళీగానే ప్రభుత్వ విప్ పదవులు శాసన మండలిలో నలుగురు ప్రభుత్వ విప్‌లకు గానూ ప్రస్తుతం ఎంఎస్ ప్రభాకర్ ఒక్కరే కొనసాగుతున్నారు. బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రభుత్వ చీఫ్ విప్‌గా 2019–21 వరకు కొనసాగారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆ స్థానంలో కొత్తగా ఎవరికీ అవకాశం దక్కలేదు. మరోవైపు ప్రభుత్వ విప్‌లుగా వ్యవహరించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2019లో, కర్నె ప్రభాకర్ 2020లో, కూచుకుంట్ల దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్ 2022 జనవరిలో ఎమ్మెల్సీలుగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. కర్నె ప్రభాకర్ మినహా మిగతా ముగ్గురు మరోమారు శాసన మండలికి ఎన్నికైనా వీరిలో మళ్లీ ప్రభుత్వ విప్‌లుగా ఎవరికి అవకాశం దక్కకపోగా, సుదీర్ఘకాలంగా మండలిలో ప్రభుత్వ విప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
షిండే కేబినెట్లో చోటుకు రూ.100 కోట్లు.. ఆ ఎమ్మెల్యేకు ఆఫర్!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. శివసేనపై తిరుగుబాటు చేసి భాజపాతో కలిసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు ఏక్నాథ్ షిండే. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వాదనలు వెలువడ్డాయి. ఈ సమయంలోనే సీఎం షిండే ఢిల్లీ పర్యాటన చేపట్టటం ఆ వాదనలకు బలం చేకూర్చింది. ఇదే అదునుగా తీసుకున్న కొందరు కేటుగాళ్లు డబ్బులు దండుకునేందుకు ప్రయత్నించారు. షిండే కేబినెట్లో చోటు కల్పిస్తామని, అందుకు రూ.100 కోట్లు ఇవ్వాలని ఓ ఎమ్మెల్యేకు ఆఫర్ ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో ప్లాన్ అడ్డం తిరిగి కటకటాలపాలయ్యారు. మంత్రివర్గంలో చోటు కోసం రూ.100 కోట్లకు బేరం ఆడారంటూ.. భాజపా ఎమ్మెల్యే రాహుల్ కుల్ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే పీఏ బాలక్రిష్ణ థోరట్‌కు జులై 16న రియాజ్ షేక్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ఎమ్మెల్యే రాహుల్‌తో ఆఫర్ గురించి మాట్లాడాలని చెప్పాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేతో తాను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానని, మీకు సాయం చేయాలనుకుంటున్నాని చెప్పాడు. ఈ క్రమంలో నారిమన్ పాయింట్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఇరువురు కలిశారు. ఈ సందర్భంగా తనకు సీనియర్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని, వారు మీకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని నమ్మించే ప్రయత్నం చేశాడు. అందుకు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాహుల్ కుల్.. వారితో బేరం ఆడి రూ.90 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల గుట్టు బయటపడింది. ఇదీ చదవండి: లోక్‌సభలో ‘సేన’ నేతగా రాహుల్ షెవాలే: షిండే -
మంత్రి పదవులు ఎవరెవరికి ??
-
కేంద్ర కేబినెట్ విస్తరణ: పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రమాణం చేసిన నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. తాజా సమాచారం ప్రకారం వివిధ కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి. ► కిషన్ రెడ్డి - పర్యాటక ,సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ ► నితిన్ గడ్కరీ - రవాణా శాఖ ► రాజ్ నాథ్ సింగ్ - రక్షణ శాఖ ►మన్సుఖ్ మాండవీయ - ఆరోగ్యశాఖ కేటాయింపు ►అమిత్ షా - హోంశాఖ, సహకార శాఖ ► అర్జున్ ముండా - గిరిజన సంక్షేమం ► కిరణ్ రిజిజు - న్యాయశాఖ ► నిర్మలా సీతారామన్ - ఆర్ధిక శాఖ ►స్మృతి ఇరానీ- మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ ► భూపేంద్ర యాదవ్ - కార్మిక శాఖ ►డాక్టర్ జై శంకర్ - విదేశీ వ్యవహారాలు ► పురుపోషత్తమ్ రూపాల - మత్స్య, పశుసంవర్దక, డెయిరీ ►పీయూష్ గోయల్ - వాణిజ్యం, పరిశ్రమలు, జౌళిశాఖ, ఆహార ప్రజా పంపిణీ ►అశ్వినీ వైష్ణవ్ - రైల్వే, ఐటీ మంత్రిత్వశాఖ ► రాజ్ కుమార్ సింగ్ - విద్యుత్, పునరుత్పాదక ఇందన శాఖ ►ధర్మేంద్ర ప్రధాన్ - విద్యా, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ ►హర్దీప్సింగ్ పూరీ - పెట్రోలియం, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ ►మహేంద్రనాథ్ పాండే - భారీ పరిశ్రమల శాఖ ►జ్యోతిరాదిత్య సింధియా - పౌర విమానయాన శాఖ ►గిరిరాజ్ సింగ్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ ►అనురాగ్ ఠాకూర్ - సమాచార ప్రసార శాఖ ►భూపేంద్ర యాదవ్ - పర్యావరణ,అటవీశాఖ, కార్మిక శాఖ ►పశుపతి పరసు - కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ► గజేంద్ర సింగ్ షెకావత్ - జల్ శక్తి ► సర్వానంద్ సోనోవాల్ - ఓడరేవులు, జలరవాణా, ఆయుష్ శాఖ ► ప్రహ్లాద్ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ ► రామచంద్రప్రసాద్ సింగ్ - ఉక్కుశాఖ ► నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయ శాఖ ►వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం,సాధికారత ► ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాల శాఖ ► నారాయణ్ రాణే - చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ► ధర్మేంద్ర ప్రదాన్ - విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ చదవండి : ఇరువురికీ న్యాయమైన వాటా దక్కాలి -
తొలి పది పదిలం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు రెండ్రోజులే ఉండటంతో కేబినెట్ కూర్పు కసరత్తు ముమ్మరమైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు పార్టీ సీనియర్ నేతలు, ఎన్డీయే పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. ప్రధాని కార్యాలయంలో (పీఎంఓ) మార్పులపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్థానంలో మరొకరు రావచ్చని తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పీఎంఓలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేఎన్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజాల్‌తో పాటు మరికొన్ని కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరి స్థానాలు పదిలం పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో ఎంపీలు ఎన్నికైనందున కేబినెట్ కూర్పు కొంత కష్టమేనని, ఒకవేళ సీనియర్లు కొందరికి చోటు దక్కకపోయినా వారు చేయగలిగిందేమీ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనా రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, గడ్కారీ, తావర్ చంద్ గెహ్లోత్, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, మేనకా గాంధీ వంటి పది మంది అగ్రనేతలకు కేబినెట్లో తిరిగి చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగుపడి, వారు అంగీకరిస్తే జైట్లీ, సుష్మా స్వరాజ్లను తీసుకోవచ్చని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యులు, ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన ముగ్గురు నేతలు రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ (ఇప్పటికే మంత్రులు), పార్టీ అధ్యక్షుడు అమిత్ షా (తొలిసారి మంత్రి అవుతారు)లకు కీలక శాఖలు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. బెంగాల్‌కు ప్రాధాన్యత పశ్చిమబెంగాల్లో పార్టీ 18 సీట్లతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. బాబుల్ సుప్రియో (ప్రస్తుత మంత్రి), లాకెట్ ఛటర్జీ, సుభాష్ సర్కార్, జయంత్ సర్కార్లకు బెంగాల్ నుంచి కేబినెట్లోకి రావొచ్చు. ఎక్కువగా యువతరానికి, కొత్త ముఖాలకు కేబినెట్లో అవకాశం ఉంటుందని పార్టీవర్గాలు వివరించాయి. ఇదే సమయంలో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోదీ ప్రసంగాన్ని గుర్తుచేస్తూ ఆ వర్గాలు వెల్లడించాయి. జేడీయూ, శివసేనలతో పాటు ఇతర పార్టీలకు చోటు దొరకొచ్చని చెప్పాయి. కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబా! గౌబా 1982 బ్యాచ్ జార్ఖండ్ కేడర్ అధికారి న్యూఢిల్లీ: కొత్త కేబినెట్ కార్యదర్శిగా హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నియమితులయ్యే చాన్సుంది. ప్రస్తుత కార్యదర్శి పి.కె.సిన్హా నాలుగేళ్ల పదవీ కాలం జూన్ 12తో ముగుస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. కాగా హోం శాఖ కార్యదర్శి పోస్టు కోసం ఇతరులతో పాటు కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం పోటీ పడుతున్నారు. అత్యంత సీనియర్ అధికారి అయిన గౌబా కేంద్రంలో, జార్ఖండ్, బిహార్ ప్రభుత్వాల్లో పనిచేశారు. ఆగస్టు 31తో హోం శాఖ కార్యదర్శిగా ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. అయితే దేశంలోనే అత్యున్నతమైన కేబినెట్ కార్యదర్శి పోస్టుకు గౌబా ఎంపికయ్యే అవకాశం ఉందని ఈ పరిణామాలపై అవగాహన కలిగిన అధికారి ఒకరు వెల్లడించారు. ఈయన జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన కేబినెట్ కార్యదర్శి అయ్యే పక్షంలో తొలుత రెండేళ్ల పదవీ కాలానికి నియమితులయ్యే అవకాశం ఉంది. తర్వాత మరో రెండేళ్ల పాటు దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది. సిన్హా కూడా 2015లో తొలుత రెండేళ్ల పదవీకాలానికి నియమితులై, తర్వాత 2016, 2018లో పొడిగింపు పొందారు. -
విధేయతకు పట్టం
సీఎం కేసీఆర్ విధేయతకు పట్టం కట్టారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయం చేశారు. సీఎం నేరుగా జగదీశ్‌రెడ్డికి ఫోన్ చేసి మంత్రి పదవి ఇస్తున్న విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం మిగతా మంత్రులతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయన రెండో సారి మంత్రి పదవి చేపడుతున్నారు. సాక్షిప్రతినిధి, సూర్యాపేట: టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా జగదీశ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఆయనకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసిన తర్వాత అధికారుల నుంచి కూడా ఫోన్ వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి జగదీశ్‌రెడ్డి 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా నుంచి ఆయన ఒక్కడికే మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఉమ్మడి జిల్లాలో పార్టీతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనదే పై చేయి అయింది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినా ఉమ్మడి జిల్లా నుంచి జగదీశ్‌రెడ్డికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారు. సీఎం జిల్లాకు ఎప్పుడు వచ్చినా జగదీశ్‌రెడ్డి ముందుండి కార్యక్రమాలు నడిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మది స్థానాల్లో ఆపార్టీ విజయఢంకా మోగించడం, సూర్యాపేట నుంచి జగదీశ్‌రెడ్డి విజయంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. నేతలు, పార్టీ శ్రేణుల ప్రచారాన్ని వాస్తవం చేస్తూ సీఎం మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన అనుచరగణం ఆనందంలో మునిగింది. ఉద్యమం నుంచి గులాబీ బాస్ వెన్నంటే.. ఉద్యమం నుంచి జగదీశ్‌రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్‌కు వెన్నంటే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ్యుల్లో ఒకడిగా ఉండడంతో తొలి నుంచి కేసీఆర్ ఆయనకు గుర్తింపునిచ్చారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఆయన ఇన్చార్జిగా వ్యవహరించారు. తొలి సారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆతర్వాత విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పని చేశారు. విద్యుత్ శాఖ ఆయనకు అప్పగించిన తర్వాతే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందించింది. అంతేకాకుండా దామరచర్ల, పాల్వంచ, మణుగూరులో నూతనంగా విద్యుత్ ప్లాంట్లు మంజూరయ్యాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడంతో ప్రభుత్వం సాధించిన ఘనతలో జగదీశ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి ప్రశంసలు అందాయి. ఇలా అన్నింటా కేసీఆర్‌కు అనుంగు నేతగా ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కింది. ప్రమాణస్వీకారానికి తరలుతున్న నేతలు.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో జరగనుంది. అయితే జగదీశ్‌రెడ్డికి సీఎం నుంచి మంత్రి పదవిపై ఫోన్ రావడంతో జిల్లాలోని ఆపార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ఆయన వెంటే ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆయనను అభినందించడానికి జిల్లా నుంచి తరలివెళ్తున్నారు. జగదీశ్‌రెడ్డి బయోడేటా పేరు : గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తండ్రి : చంద్రారెడ్డి తల్లి : సావిత్రమ్మ భార్య : సునీత కుమారుడు : వేమన్‌రెడ్డి కూతురు : లహరి పుట్టినతేదీ : 18.07.1965 స్వగ్రామం : నాగారం (నాగారం మండలం) విద్యార్హత : బీఏ, బీఎల్ 27.04.2001 టీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యులు 2001 సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి, సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్చార్జి 2002 మహబూబ్‌నగర్ పాదయాత్ర ఇన్చార్జి (జల సాధన 45 రోజుల కార్యక్రమం. పాదయాత్ర ఆలంపూర్ నుంచి ఆర్డీఎస్ వరకు..) 2003 మెదక్ ఉప ఎన్నికల ఇన్చార్జి 2004 సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్చార్జి (హరీష్‌రావు ఎన్నిక) 2005 సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి 2006 కరీంనగర్ ఎంపీ ఉప ఎన్నికల ఇన్చార్జి 2008 ముషీరాబాద్, ఆలేరు ఉప ఎన్నికల ఇన్చార్జి, మెదక్ జిల్లా ఇన్చార్జి 2009లో హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ 2013లో నల్లగొండ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి 2014లో సూర్యాపేట నుంచి పోటీ .. విజయం తెలంగాణలో తొలి విద్యాశాఖ మంత్రి ఆతర్వాత విద్యుత్‌శాఖ , ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి 2108 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలు.. సూర్యాపేట నుంచి విజయం -
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఐకే రెడ్డికి చాన్స్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ, విధేయతను ప్రామాణికంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో ఈ విడత నిర్మల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి)కి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉన్నత విద్యావంతుడు, సీనియర్ రాజకీయవేత్త అయిన ఐకే రెడ్డికి ఈసారి కేబినెట్లో కీలకమైన శాఖను కట్టబెట్టే అవకాశం ఉంది. జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, బీసీ నాయకుడు జోగు రామన్నకు రిక్తహస్తం ఎదురుకానుంది. ఈసారి కేబినెట్లోకి పరిమిత సంఖ్యలోనే మంత్రులను తీసుకొని, పార్లమెంటు ఎన్నికల తరువాత మలిదఫా విస్తరణ ఉంటుందని సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఐకే రెడ్డి ఒక్కరికే అవకాశం లభిస్తుందని స్పష్టమవుతోంది. గత ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లపాటు రాష్ట్ర న్యాయ, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఇంద్రకరణ్‌రెడ్డికి మరోసారి పదవి లభించనుందని స్పష్టం కావడంతో ఆయన వర్గీయులు, టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు విధేయుడు... రాజకీయ యోధుడు ఐకే రెడ్డి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి బలమైన నాయకుడు. 1984 నుంచే రాజకీయాల్లో ఉన్న ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, శాసనసభ, పార్లమెంటు సభ్యులుగా సేవలు అందించారు. 2014 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించిన ఐకే రెడ్డి గెలిచిన వెంటనే టీఆర్ఎస్లో చేరి మంత్రిగా నాలుగున్నరేళ్లు కొనసాగారు. మంత్రిగా అందరికీ అందుబాటులో ఉంటారని పేరున్న ఐకే రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విధేయుడిగా పేరొందారు. 2018 ఎన్నికల్లో నిర్మల్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డిపై 9వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 స్థానాలకు 9 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి ఐకే రెడ్డికే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. పేరు: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తల్లిదండ్రులు: చిన్నమ్మ–నారాయణరెడ్డి భార్య: విజయలక్ష్మి పిల్లలు: కుమారుడు గౌతంరెడ్డి, కోడలు దివ్యారెడ్డి, కూతురు పల్లవిరెడ్డి, అల్లుడు రంజిత్‌రెడ్డి పుట్టినతేది: 16.02.1949 విద్యార్హత: బీకాం, ఎల్ఎల్బీ రాజకీయ అనుభవం: 1987లో జెడ్పీచైర్మన్‌గా, 1991–96 ఎంపీగా, 1999, 2004లో ఎమ్మెల్యేగా, 2008లో ఎంపీగా పనిచేశారు. 2000 సంవత్సరంలో టీసీఎల్‌ఎఫ్ కన్వీనర్‌గా వ్యవహరించారు. 1994, 1996లలో ఎంపీగా, 2009 నిర్మల్, 2010 సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందారు. 2014ఎన్నికల్లో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లో చేరిక. రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు. సామాజిక సమీకరణల్లో మాజీ మంత్రి జోగు రామన్న వెనుకబాటు గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన జోగు రామన్నకు ఈసారి అవకాశం దక్కడం లేదని స్పష్టమవుతోంది. మంత్రివర్గం కూర్పులో బీసీలకు ఇతర జిల్లాల నుంచి అవకాశం లభిస్తుండడం, సామాజికవర్గం పరంగా కూడా వరంగల్ నుంచి మున్నూరుకాపు వర్గానికి చెందిన వినయ్‌భాస్కర్‌కు చీఫ్ విప్‌గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామన్నకు మంత్రివర్గంలో చోటు లేనట్టేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. సుమన్‌కు కలిసిరాని సామాజిక కూర్పు పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతూనే చెన్నూరు శాసనసభ స్థానం నుంచి ఘన విజయం సాధించిన బాల్క సుమన్‌కు సామాజిక కూర్పులో భాగంగానే ఈ విడతలో మంత్రి యోగం దక్కలేదని సమాచారం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రి వర్గంలో స్థానం దాదాపుగా ఖరారైంది. అదే పార్లమెంటు స్థానంలో పరిధిలో ఈశ్వర్ సామాజిక వర్గానికే చెందిన సుమన్‌కు తద్వారా అవకాశం లభించలేదని సమాచారం. అయితే పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే మలి విడత విస్తరణలో సుమన్‌కు మంత్రి పదవి లేదా కేబినెట్ హోదాలో మరేదైనా కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. రేఖానాయక్ తదితరులకు నిరాశే! మహిళలకు గత ప్రభుత్వంలో అవకాశం లభించని నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఖానాపూర్ మహిళా ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌కు ఈసారి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. రేఖానాయక్‌కు అవకాశం ఇస్తే మహిళ, ఎస్టీ కోటా రెండు భర్తీ అవుతాయని భావించారు. అయితే పరిమిత కేబినెట్ విస్తరణలో సామాజిక, మహిళ, తదితర కోటాల జోలికి వెళ్లకుండా 8 లేదా 9 మందితో విస్తరణ జరపాలని ముఖ్యమంత్రి భావిస్తుండడంతో రేఖానాయక్‌కు నిరాశే ఎదురైంది. సిర్పూరు నుంచి మూడుసార్లు విజయం సాధించిన కోనేరు కోనప్ప సైతం మంత్రి పదవికి రేసులో ఉన్నారు. ఆయన సైతం ‘కమ్మ’ సామాజిక వర్గం నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా అవకాశం లభిస్తుందని ఆశించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్‌రావు(మంచిర్యాల) సైతం సీనియర్ సభ్యుడిగా చాన్స్ దక్కకపోతుందా అని భావించారు. అయితే సామాజిక వర్గాల కూడికలు, తీసివేతల్లో భాగంగానే వీరికి అవకాశం దక్కలేదనేది సుస్పష్టం. -
మంత్రులు ఇద్దరు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికీ మంత్రుల అవకాశం దక్కింది. ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మాజీమంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు మరోమారు మంత్రి పదవి దక్కింది. ప్రభుత్వ మాజీ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు తొలిసారి మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ ఇద్దరు నేతలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు కుటుంబసభ్యులతో ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సోమవారం సమాచారం అందింది. ఈసారి మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరిగింది. సీఎం తనయుడు, మాజీమంత్రి కేటీఆర్ పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు చూస్తుండటంతో ఆయనను కేబినెట్లోకి తీసుకోలేదంటున్నారు. ఈనేపథ్యంలో మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ విప్ కొప్పులకు మంత్రులకు అవకాశం కల్పించినట్లు చెప్తున్నారు. తమ అభిమాన నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారన్న సమాచారం అందుకున్న ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ అభిమానులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం రాత్రే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఓటమెరుగని నేత ‘ఈటల’.. ఆరుసార్లు గెలిచిన ‘కొప్పుల’ ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్ వరుస విజయాలతో ఓటమెరుగని నేతగా నిలిచారు. ఈటల రాజేందర్ 2004లో కమలాపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 2008 ఉప ఎన్నికల్లోనూ విజేతగా నిలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా హుజురాబాద్ నియోజకవర్గానికి రాజకీయ మకాం మార్చిన ఈయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికలవరకు వరుస విజయాలతో సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో బరిలో నిలిచి గెలిచిన రాజేందర్ డబుల్ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తెలంగాణ మొదటి కేబినెట్లో ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావడంలో కీలకంగా వ్యవహరించారు. మాజీ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఏడుసార్లు పోటీచేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఓడిన ఈయన ఆ తర్వాత వరుస విజయాలు సాధించారు. రద్దైన మేడారం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ తరఫున 1994లో తొలిసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2004లో మేడారం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2008 ఉప ఎన్నికలో విజేతగా నిలిచారు. తరువాత ధర్మపురి నియోజకవర్గానికి మారిన ఆయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2019లో వరుస విజయాలతో దూసుకెళ్లారు. ఏడుసార్లు పోటీ ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈయన గత కేబినెట్లోనే మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా.. సమీకరణలు, సామాజిక కోణాల సర్దుబాటులో తృటిలో తప్పింది. ఈసారి ఈటల రాజేందర్‌తోపాటు కొప్పుల ఈశ్వర్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శాఖల కేటాయింపుపై సస్పెన్స్.. ప్రమాణ స్వీకారం తర్వాతే బాధ్యతలు మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ విప్ కొప్పుల ఈశ్వర్‌కు ఈ మంత్రివర్గంలో స్థానం లభించగా.. ఈ ఇద్దరు నేతలకు ఏయే శాఖలు కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సీఎంగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 16 మందిని భర్తీ చేయాల్సి ఉంది. ఈసారి 10 మందినే భర్తీ చేస్తున్నందున.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలకు ఏ శాఖలు కేటాయిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈసారి కొందరి శాఖల మార్పులు ఖాయమన్న ప్రచారం బలంగా ఉంది. ఈ మంత్రివర్గంలో కేటీఆర్ లేకపోగా.. మిగిలింది ఈటల రాజేందర్. సీఎంవో కార్యాలయం నుంచి ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని మాత్రమే సమాచారం అందగా.. కేటాయించే శాఖల ప్రస్తావన లేదు. గత ప్రభుత్వంలో రాజేందర్ ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సారి ఏ శాఖ కేటాయిస్తారనేది చర్చనీయాంశం అయ్యింది. కొత్తగా మంత్రివర్గంలో చేరుతున్న కొప్పుల ఈశ్వర్‌కు కేటాయించే శాఖపైనా చర్చ జరుగుతోంది. ఈ విషయమై అధినేత కేసీఆర్ ఏం యోచిస్తున్నారు? అయన మదిలో ఏముంది..? అనేది ప్రమాణ స్వీకారం తర్వాతే తేలనుందంటున్నారు. ‘ఈటల’ బయోడేటా.. పేరు : ఈటల రాజేందర్ పుట్టినతేదీ : 24–03–1964 తల్లిదండ్రులు : ఈటల వెంకటమ్మ, మల్లయ్య స్వగ్రామం : కమలాపూర్ విద్యాభ్యాసం : బీఎస్సీ(బీజెడ్సీ), ఎల్ఎల్బీ డిస్కంటిన్యూ వ్యాపారం : 1986 నుండి కోళ్ళపరిశ్రమ వ్యాపారం కుటుంబం : భార్య జమునారెడ్డి, కూతురు నీత్, ఒక కొడుకు నితిన్ రాజకీయ నేపథ్యం 2002లో టీఆర్ఎస్లో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2004లో మెుదటిసారిగా కమలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ లెజిస్లెషన్ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్‌రావుపై 15,035 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2010 ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎం.దామోదర్‌రెడ్డి, 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై విజయం సాధించిన రాజేందర్, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిని ఓడించారు. 2014లో కేసీఆర్ కేబినేట్లో ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించిన ఈయనకు రెండోసారి కేసీఆర్ కొలువులో మంత్రిగా అవకాశం దక్కింది. ‘కొప్పుల’ బయోడేటా.. పేరు : కొప్పుల ఈశ్వర్ పుట్టిన తేదీ : 1959 ఏప్రిల్ 20 తల్లిదండ్రులు : మల్లమ్మ, లింగయ్య విద్యార్హతలు : డిగ్రీ స్వగ్రామం : కుమ్మరికుంట, జూలపల్లి మండలం భార్య : స్నేహలత పిల్లలు : కూతురు నందిని, అల్లుడు అనిల్, మనుమడు భవానీనిశ్చల్ రాజకీయ నేపథ్యం సింగరేణి సంస్థలో 20ఏళ్లపాటు ఉద్యోగిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరిన ఈశ్వర్ రాష్ట్ర మిడ్‌క్యాప్ సంస్థ డైరెక్టర్‌గా.. మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్‌గా.. మేడారం నియోజకవర్గం దేశం పార్టీ ఇన్చార్జిగా పనిచేశారు. 1994లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2001 టీఆర్ఎస్లో చేరారు. 2004 జనవరిలో జరిగిన ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి 56 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో 28వేల ఓట్ల మెజార్టీతో అదేస్థానం నుంచి ఎన్నికయ్యారు. నియోజకవర్గ పునర్విభజనలో మేడారం నియోజకవర్గం రద్దు కావడంతో ధర్మపురి నియోజకవర్గం నుంచి 2009 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. 2009, 2010 ఉప ఎన్నిక, 2014 సాధారణ, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను వరుసగా ఓడించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రిపదవి దక్కింది. -
ఏడుగురు మంత్రులకు ఉద్వాసన..!
-
మంత్రి పదవికి లోకేశ్ ఒత్తిడి ఉగాదికి ముహూర్తం!
మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ► మృణాళిని, పల్లె, రావెల, పీతల, పత్తిపాటి, నారాయణలకు ఉద్వాసన ► నారాయణకు సీఆర్డీఏ చైర్మన్ పదవి... లోకేశ్‌కు మున్సిపల్, ఐటీ శాఖలు ► కళా వెంకట్రావు, అఖిలప్రియ, అమర్నాథ్రెడ్డి, మాగుంట, మహ్మద్ జానీ, గొల్లపల్లి, సుజయకృష్ణకు పదవులు! సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం తో మంత్రివర్గంలో వెంటనే చేరిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నెల 19న మంచి ముహుర్తమని, ఆరోజు మంత్రివర్గం లో మార్పులు చేర్పులు చేపట్టాలని తండ్రిపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 19వ తేదీన లోకేశ్ నక్షత్రబలం బాగుందని, అదే రోజు మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని సీఎం కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబంలో తీవ్ర తర్జనభర్జనలు సాగాయని, 19వ తేదీన మంత్రివర్గంలో మార్పులు చేయకపోతే తదుపరి తేదీని ఇప్పుడే చెప్పాలంటూ లోకేశ్, ఆయన కుటుంబ సభ్యులు పట్టు పట్టారని సమాచారం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత ఉగాది రోజు కేబినెట్లో మార్పులు, చేర్పులు చేపడతా నని, ఉగాది మంచి రోజుని చంద్రబాబు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపడితే ఎన్నికల్లో ఏదైనా జరిగితే అసలుకే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన నచ్చజెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన మరుసటి రోజునే లోకేశ్‌కు మంత్రి పదవి ఇచ్చి పట్టాభిషేకం చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీకి చెందిన అత్యున్నత వర్గాలు తెలిపాయి. లోకేశ్‌కు మున్సిపల్–పట్టణాభివృద్ధి, ఐటీ శాఖలను ఇవ్వనున్నారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న నారాయణను మంత్రివర్గం నుంచి తప్పించి, సీఆర్డీఏ చైర్మన్ పదవిని ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడుగురికి ఉద్వాసన... కేబినెట్లో భారీగా మార్పులు, చేర్పులు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న వారిలో ఆరుగురు లేదా ఏడుగురికి ఉద్వాసన పలకనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న మృణాళినికి ఉద్వాసన పలకనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారని, ఆయనపై కూడా కత్తి వేలాడుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని కూడా మంత్రివర్గం నుంచి తప్పించనున్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రావెల కిషోర్‌బాబు, గనులు శాఖ మంత్రి పీతల సుజాత, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. కొత్తగా మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావులు వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మహ్మద్ జానీకి మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు! వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ఆశ చూపడమే కాకుండా కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను మంత్రివర్గం లోకి తీసుకోవడంపై తర్జనభర్జన పడుతున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అమరనాథ్‌రెడ్డి, సుజయ రంగారావులకు కూడా మంత్రి పదవులు దక్కవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటు న్నాయి. అయితే వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు ఇప్పటికే పార్టీ అధినేతకు అల్టిమేటమ్‌లు జారీ చేశారు. -
పదవుల కోసం అర్ధించము:శివసేన
ముంబై: ఎన్ డీఏ ప్రభుత్వంలో మిత్ర పక్షంగా ఉంటూ కయ్యాల కాపురం చేస్తున్న శివసేన కాబినెట్ విస్తరణపై స్పందించింది. విస్తరణలో పదవి దక్కదని స్పష్టం కావడంతో మరోసారి బీజేపీపై విరుచుకుపడింది. శివసేన ఆత్మగౌరవ పార్టీ అని పదవుల కోసం ఎవరినీ అర్ధించదని ఆపార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే మీడియాతో మట్లాడుతూ అన్నారు. ఎవరి గుమ్మం ముందూ తాము పదవుల కోసం నిలబడమని తెలిపారు. పదవులు తమ పార్టీకి ప్రథమ ప్రాధాన్యం కాదని అన్నారు. కేంద్ర కేబినెట్ లో ఆపార్టీకి చెందిన అనంత్ గీతే మంత్రి పదవిని నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా సేన,బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. -
టీఆర్ఎస్లో పదవుల లొల్లి
-
గెలుపు తంత్రం... ‘గులాబీ’ మంత్రం
నగర చరిత్రలో తొలిసారిగా విపక్ష సభ్యుడికి స్థానం నలుగురికి అమాత్య పదవులతో సామాజిక సమతూకం వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు మంత్రమే లక్ష్యం ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామాపై తర్జనభర్జనలు హైదరాబాద్: నగర రాజకీయాల్లో మంగళవారం ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. టీడీపీ తరఫున సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రెండు రోజుల క్రితమే క్యాబినెట్ బెర్త్ ఖరారు కావటంతో తలసాని నివాసం సోమవారం కిటకిటలాడింది. ఆయన అనుచరులు నగరాన్ని అభినందనల ఫ్లెక్సీలతో ముంచెత్తారు. 24 శాసనసభ స్థానాలు కలిగిన గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచింది కేవలం మూడు స్థానాల్లోనే. దీంతో పార్టీని పునాది నుంచినిర్మించాలనేది అధినేత కేసీఆర్ వ్యూహం. అందులో భాగంగా టీఆర్ఎస్లోకి వచ్చిన తలసానికి క్యాబినెట్ పదవిని కట్టబెట్టారు. తద్వారా వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు భారం ఆయనపైనే మోపాలని పార్టీ అధినేత నిర్ణయించినట్లు సమాచారం. సమతూకం గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కుల,మతాల సమతూకంతో క్యాబినెట్ పదవుల పంపకం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే క్యాబినెట్లో మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్ అలీని డిప్యుటీ సీఎంగా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయిని నర్సింహారెడ్డిని హోంమంత్రిగా, గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మారావును ఎక్సైజ్ మంత్రిగా నియమించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంగళవారం క్యాబినెట్లో చేర్చుకోబోతున్నారు. దీంతో నగరంలో ప్రధాన సామాజిక వర్గాలన్నింటికీ ప్రాధాన్యమిచ్చినట్లవుతుందని టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే 1986లో జరిగిన మోండ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల నుంచిఉప్పు-నిప్పుగా వ్యవహరిస్తున్న తలసాని -పద్మారావుల మధ్య రాజకీయ సఖ్యత ఎలా కుదురుతుందన్న అంశం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. 1986లో మోండా డివిజన్ నుంచిపద్మారావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా...జనతా పార్టీ తరఫున బరిలోకి దిగిన తలసాని ఓటమి పాలయ్యారు. అనంతరం సికింద్రాబాద్ శాసనసభ ఎన్నికల్లో ఇద్దరూ రెండుసార్లు తలపడి... చొరొకసారి విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో ఇరువురు వేర్వేరు నియోకజవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించినా, ఇద్దరి మధ్య పాత వివాదాలు సమసిపోలేదు. రాజీనామాపై తర్జన భర్జనలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి... టీఆర్ఎస్లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ రాజీనామాపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న తలసాని... ఒకటి, రెండు రోజుల్లో పదవికి రాజీనామా చేసి, మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చే సే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆర్నెళ్ల లోపు జరిగే ఎన్నికల్లో తలసానిని టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించి... గెలిచిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు సమాచారం. -
టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అలక
-
ఢిల్లీలో బాబు లాబియింగ్!
-
మంత్రి పదవి ఆశలు గల్లంతైనట్టే
సాక్షి ప్రతినిధి, విజయనగరం : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామినాయుడికి మంత్రి పదవి ఆశలు గల్లంతైనట్టే. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేసినా ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు తప్పకుండా చోటు దక్కుతుందని భావిం చినా... అధినేత కరుణించడం లేదు. మంత్రి పదవి రేసులో లేకుండా వ్యూహాత్మంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెగ్గొడుతున్నారు. టీటీడీ బోర్డు డెరైక్టర్ పదవితో సరిపుచ్చేసి చేతులు దులుపేసుకోవాలని చూస్తున్నారు. టీటీడీ పాలక మండలి కసరత్తులో ఓ డెరైక్టర్‌గా పతివాడ పేరును ప్రస్తావించినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పతివాడ నారాయణస్వామినాయుడికి తప్పకుండా మంత్రి పదవి వస్తుందని పార్టీ వర్గాలు భావించాయి. సీనియర్ నేతగా తనకే దక్కుతుందని ఆయన కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు అందరి అంచనాలను తలకిందలు చేశారు. సీనియార్టీని పక్కనపెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కిమిడి మృణాళినిని కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో పతివాడ కంగుతిన్నారు. ఎందుకిలా జరిగిందని పార్టీ వర్గాలు ఆరా తీసేసరికి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. సిక్కోలులో సీనియర్ నేతగా ఉన్న కిమిడి కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇస్తే తనను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడికి అన్యాయం చేసినట్టు అవుతుందని, ఇద్దరికీ ఇద్దామనుకుంటే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వారి మధ్య మరింత వైరం, గ్రూపులు పెంచి పోషినట్టు అవుతుందని వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. కళా వెంకటరావుకు అన్యాయం జరగకుండా ఆయన మరదలు మృణాళినికి విజయనగరం జిల్లా నుంచి, ఆద్యంతం తన వెంట ఉన్న అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం జిల్లా కోటాలో మంత్రిగా ఇస్తే ఏ ఇబ్బందులుండవని పక్కా పథకం ప్రకారం మంత్రి పదవులు కేటాయించారు. మొత్తానికి చంద్రబాబు రాజకీయ ఎత్తుగడకు పతివాడ నారాయణస్వామినాయుడు కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. పక్క జిల్లా నుంచి వచ్చిన నేతకు మంత్రి పదవి ఎలా ఇస్తారని, జిల్లాలో సీనియర్‌ను వదిలేసి ఎన్నికల ముందు జిల్లాకొచ్చిన నేతకు మంత్రి పదవి కట్టబెట్టడమేంటని పతివాడ వర్గీయులు ఎంత గొంతు చించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈసారి రాకపోయినా కేబినెట్ విస్తరణలోనైనా వస్తుందని, అధైర్యపడొద్దని ఒకరికొకరు సముదాయించుకున్నారు. తన వర్గ నేతలతో కలిసి చంద్రబాబును కలిసి మొర పెట్టుకున్నారు. అవకాశం చిక్కినప్పుడుల్లా అధినేతను కలిసి తమ గోడు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలతో ఓ వర్గంగా కొనసాగుతున్నారు. జిల్లాలో తమకున్న పట్టును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ పావులు కదుపుతున్నారు. కానీ, చంద్రబాబు ఆ దిశగా ఆలోచించలేదు. మంత్రి పదవి ఇస్తే గ్రూపులెక్కువవుతాయనో, కాంగ్రెస్ నేతలతో ఉన్న సత్సంబంధాల కారణంగా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చోటు చేసుకుంటాయనో భయమో తెలియదు గాని టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించి సరిపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే పాలక మండలి కసరత్తులో పతివాడ పేరును చేర్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వయస్సు పైబడుతుండటం, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి వెరసీ సీనియర్ నేతకు మరోసారి అమాత్య యోగం లేనట్టే కనబడుతోంది. -
ఎమ్మెల్యే వెంకట్రావ్‌కు తీవ్ర అస్వస్థత
విజయవాడ: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తారని కాగిత భావించారు. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఆయన అనుచరులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పదవీ త్యాగాలకు సిద్ధపడ్డారు. ఆదివారం చంద్రబాబు ప్రమాణస్వీకార సభకు వెళ్లవద్దని పట్టుబట్డారు. ఈ పరిస్థితుల్లో వెంకట్రావ్ ఒత్తిడికి లోనుకావడంతో బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి. సోమవారం ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు విజయవాడలోని హార్ట్‌కేర్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆస్పత్రికి వెళ్లి వైద్యులను అడిగి వెంకట్రావ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారని ఉమామహేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్యులతో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నిన్నటి నుంచి వెంకట్రావ్ ఆహారం తీసుకోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీసీ గౌడ సామాజికవర్గానికి చెందిన వెంకట్రావ్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆయన అభిమానులు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మంత్రి పదవి కోసం ఒకే జిల్లా నుంచి ఆరుగురు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి పదవుల పంపిణీ తలనొప్పిగా మారింది. కొన్ని జిల్లాల్లో చాలామంది నాయకులు పోటీపడటంతో ఇబ్బందికరంగా మారింది. అనంతపురం జిల్లా నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తూ పైరవీలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, సీనియార్టీ ప్రాతిపదికను బట్టి తమకు బెర్తు దక్కుతుందని ఎవరికివారే ఆశల పల్లకీల్లో విహరిస్తున్నారు. దీంతో కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో బాబు మల్లగుల్లాలుపడుతున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు మంత్రి పదవి లభిస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే హిందూపురం నుంచి గెలిచిన చంద్రబాబు వియ్యంకుడు, సినీ హీరో బాలకృష్ణ తనకు కేబినెట్ బెర్తు కావాలని పట్టుబడితే ఆయనకు ఇవ్వడం గ్యారెంటీ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణకు మంత్రి పదవి ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన సునీతకు చాన్స్ లేనట్టే. ఇక ఉరవకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ కూడా రేసులో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్సీగా ఎంపిక చేసి అవకాశం కల్పించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఒక్కరికే చాన్స్ దక్కే అవకాశముంది. ఇక బీసీ కోటాలో తమకు ఇవ్వాలంటూ కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథి కోరుతున్నారు. ఇద్దరూ సీనియర్ నాయకులే కావడంతో బాబు ఎవరివైపు మొగ్గు చూపుతారో? ఇక పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. బాబును కలసి తన మనసులో మాట చెప్పారు. ఒకే జిల్లా నుంచి ఆరుగురు మంత్రి పదవి రేసులో ఉండటంతో అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి? -
మంత్రి పదవిపై ఆసక్తి లేదు: కేటీఆర్
సిరిసిల్ల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆనందంగా ఉందని, మంత్రి పదవిపై ఆసక్తి లేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అవుతున్నారన్నారు. మంత్రి పదవిపై తనకు ఆసక్తి లేదని, పార్టీ నిర్ణయం, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకునేందుకు సుపరిపాలన అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు.