
మంత్రి పదవిపై ఆసక్తి లేదు: కేటీఆర్
సిరిసిల్ల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆనందంగా ఉందని, మంత్రి పదవిపై ఆసక్తి లేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అవుతున్నారన్నారు. మంత్రి పదవిపై తనకు ఆసక్తి లేదని, పార్టీ నిర్ణయం, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకునేందుకు సుపరిపాలన అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు.