వచ్చే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం తో మంత్రివర్గంలో వెంటనే చేరిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నెల 19న మంచి ముహుర్తమని, ఆరోజు మంత్రివర్గం లో మార్పులు చేర్పులు చేపట్టాలని తండ్రిపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 19వ తేదీన లోకేశ్ నక్షత్రబలం బాగుందని, అదే రోజు మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని సీఎం కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబంలో తీవ్ర తర్జనభర్జనలు సాగాయని, 19వ తేదీన మంత్రివర్గంలో మార్పులు చేయకపోతే తదుపరి తేదీని ఇప్పుడే చెప్పాలంటూ లోకేశ్, ఆయన కుటుంబ సభ్యులు పట్టు పట్టారని సమాచారం.