AP Volunteers Open Letter To JanaSena Chief Pawan Kalyan - Sakshi
Sakshi News home page

పవన్‌కు వాలంటీర్ల బహిరంగ లేఖ.. పది ప్రశ్నలు.. దేనికైనా స్పందించాలంటూ..

Published Tue, Jul 11 2023 7:05 PM | Last Updated on Tue, Jul 11 2023 7:33 PM

AP Volunteers Open Letter To JanaSena Chief Pawan Kalyan - Sakshi

పావలా అంత పరువు కూడా లేని పవన్ కళ్యాణ్ గారికి.. రెండున్నర లక్షల మంది సేవా సైన్యం నమస్కరించకుండా వ్రాయు లేఖ ఏమనగా...

‘‘అయ్యా జల్సా రాయుడు గారూ..

అమ్మాయిలను అక్రమ రవాణా చేసే క్రిమినల్స్ ఈ వాలంటీర్స్ అన్నారు  మీరు. కానీ, అయ్యా ..
సంక్షేమం పొందే ప్రతి గడపలో మేమే.. అవ్వా తాతల చిరునవ్వులో మేమే.
వరదలు వంటి విపత్కర పరిస్దితులలో చేయందించి సాయం చేసింది మేమే.
కరోనా వంటి ప్రమాదకర పరిస్దితులలో ప్రాణాలకు తెగించి సాయపడింది మేమే.
ఇవేవీ మీ కళ్ళకు కనబడలేదా..?

మా సేవలను ప్రశంసిస్తూ దేశమే జేజేలు కొట్టింది మీకు వినబడలేదా... కేంద్ర నిఘా సంస్ధకు చెందిన వ్యక్తి మాగురించి మీకు చెప్పారు అన్నారు. నిజంగా మేము మానవ అక్రమ రవాణాకు పాల్పడుతుంటే ఆ నిఘా అధికారి కేంద్ర ప్రభుత్వానికి.. ఆధారాలతో సహా నివేదిక ఇస్తారు. కానీ మీకెందుకు చెప్పారు. ఒక్కటి అడుగుతున్నాం చెప్పు.. నువ్వేమైనా కేంద్ర హోం మంత్రివా చెప్పు...కేంద్ర మంత్రివా చెప్పు.. పోనీ ఎంపీవా చెప్పు.. అసలు ఎమ్మెల్యేవా చెప్పు.. అంతెందుకు జెడ్పీటీసీవా చెప్పు.. ఎంపీటీసీవా చెప్పు.. పోనీ ఓ గ్రామానికి సర్పంచువా చెప్పు. కనీసం వార్డు మెంబరు కూడా కాని నీకు మాగురించి చెప్పిన ఆ నిఘా సంస్ధ అధికారి ఎవరో చెప్పు.

అఫ్ కోర్స్ మీకు తిక్కుండొచ్చు...దానికి బాబు గారు ఇచ్చే లెక్కుండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మాపై ఇలాంటి నిందలు వేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించాల్సింది. రెండన్నర లక్షల మంది వాలంటీర్లలో దాదాపు  లక్షా 30 వేల మంది మహిళలే వున్నారు. వారందరినీ క్రిమినల్స్ అన్నావ్. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశావ్. అయ్యా చివరిగా ఒక్కమాట. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ ఈ మధ్య పాలిటిక్స్ లో తరచుగా వినిపిస్తున్న మాట...మీ మూడవ భార్య కనబడటం లేదు అని. ఇంకా నయం దానికి కారణం మేం అనలేదు!. ధన్యవాదాలు సార్..

ఇట్లు..
ఏపీ సేవా సైన్యం.

సార్.. పవన్ కల్యాణ్ గారూ పై లెటర్‌కు బదులిస్తారా ? లేక ఈ పది ప్రశ్నలకు సమాధానం ఇస్తారా ?..

  • 1.. వాలంటీర్లు మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారా.. ఇది నీ దత్త తండ్రి రాసిచ్చిన స్క్రిప్ట్ కాదా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు!
  • 2.. ప్రతీ నెలా ఒకటో తారీఖున తలుపు తట్టి అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ పెడుతోంది వాలంటీర్లు కాదా... హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు!
  • 3.. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రతి గడపకూ చేరుస్తున్న సారథులు వాలంటీర్లు కాదా... హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు!
  • 4.. కరోనా టైంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆదుకుంది వాలంటీర్లు కాదా... హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు !
  • 5.. కరోనాతో మరణించిన వారిని అయినవారు వదిలేస్తే  దహన సంస్కారాలు చేసింది వాలంటీర్లు కాదా..హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు!
  • 6.. వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించింది వాలంటీర్లు కాదా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు!
  • 7.. కేరళ మాత్రమే కాదు.. బ్రిటన్ వంటి దేశాలు వాలంటీర్ వ్యవస్థను ఆదర్శంగా తీసుకున్నది వాస్తవం కాదా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు!
  • 8.. సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పని తీరు బాగుందని ప్రధాని ప్రశంసించలేదా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు!
  • 9.. దత్తతండ్రి పాలనలో వేలాది మంది మహిళలు మిస్ అయ్యింది నిజం కాదా.. నువ్వు ఆ ప్రభుత్వంలో లేవా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు!
  • 10.. వాలంటీర్లంటే దత్తతండ్రికి భయం... నీకు వెన్నులో వణుకు.. అందుకే వారిపై నిందలు మోపావు కదా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement