సాక్షి, హైదరాబాద్: నేతన్నలవి ఆత్మహత్యలు కావు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనంటూ కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అంటూ సీఎం రేవంత్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇప్పటివరకు 10 మంది నేతన్నలు ఆత్మబలిదానం చేసుకున్నారని.. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో నేతన్నలకు అందిన ప్రతి పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘ప్రాణాలు పోతున్న పట్టింపు లేదా?. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. గతంలో అందిన ప్రతి కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో నేతన్నలకు తమ పార్టీ, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment