సాక్షి, హైదరాబాద్: తనపై జరుగుతున్న దుష్ప్రచారం ఓ ముఖ్యనేత కుట్రేనంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ సీరియస్ అయ్యారు.
‘‘నేను పార్టీలో కొన్ని సమస్యల పట్ల అసంతృప్తిగా ఉండొచ్చు. ఇదంతా ఇంటి దొంగల కుట్రేనని ఉత్తమ్ వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో నా అనుచరులను అణగదొక్కేందుకు వాళ్లను తొలగించడానికి లక్ష్యంగా ప్రచారం జరిగింది. నేను బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం’’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు.
కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాకముందే పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. అధికార బీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు సైతం ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీలు మారుతుండగా.. మరొకొందరు పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కూడా పార్టీ మారుతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన బహిరంగ లేఖ ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు.
చదవండి: కేటీఆర్‌కు పిండ ప్రదానం.. రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment