ఇది గడీల రాజ్యమా: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే పైరవీభవన్ వంటి ప్రగతిభవన్‌కే సీఎం కేసీఆర్ పరిమితం కావడం దొరలు, గడీల రాజ్యానికి కొనసాగింపు కాదా అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బూటకపు వాగ్దానాలు చేసి అవగా హన లేకుండా పాలన చేస్తున్నారన్నారు. ఈమేరకు శుక్ర వారం సీఎం కేసీఆర్‌కు పొన్నాల బహిరంగ లేఖ రాశారు.
నోట్ల రద్దు వల్ల వ్యవ సాయ పనులు వదిలిపెట్టి బ్యాంకుల ముందు నగదు కోసం రైతులు పడి గాపులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నోట్ల రద్దుకు మద్దతిచ్చిన సీఎం.. రైతులకు నగదు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ వైఫల్యంవల్ల పంటరుణాల మాఫీ పథకం కేవలం వడ్డీమాఫీ పథకంగా మారిందని, బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదని స్వయంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేసినా రైతులకు ఉపయోగం లేకుండాపోయిందని పేర్కొన్నారు.