చంద్రబాబు అబద్ధాలు నమ్మొద్దు | mudragada padmanabham open letter to pawan kalyan | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అబద్ధాలు నమ్మొద్దు

Published Wed, Aug 2 2017 12:33 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

చంద్రబాబు అబద్ధాలు నమ్మొద్దు - Sakshi

చంద్రబాబు అబద్ధాలు నమ్మొద్దు

పవన్‌కు ముద్రగడ లేఖ
కిర్లంపూడి (జగ్గంపేట): చంద్రబాబు ఉచ్చులో పడి ఆయన చెప్పే అబద్ధాలు నిజమని నమ్మి మీ పరపతి తగ్గించుకోవద్దని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.. 
 
‘మా జాతికి (బలిజ, తెలగ, కాపు, ఒంటరి) రిజర్వేషన్లపై అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 28–08–1994న ఇచ్చిన జీఓ నంబర్‌ 30ని గౌరవ హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ కొట్టివేసిందని చెప్పడంతో పాటు బీసీ రిజర్వేషన్‌ జీఓ ఇవ్వాలని కాపు ఉద్యమకారులు తొందర చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి మీ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు వారి పెంపుడు పత్రికలో మంగళవారం ప్రచురితమైంది. వాస్తవానికి  జీఓ నంబర్‌ 30 సక్రమంగానే ఇచ్చారని కోర్టు ఇచ్చిన తీర్పు 07–04–1995లో ఈనాడు పత్రికలో కూడా ప్రచురితమైంది.

మంత్రి అచ్చెన్నాయుడు 2016 ఆగస్టు 8న కిర్లంపూడికి వచ్చి ఏడు మాసాల్లో కమిషన్‌ రిపోర్టు తెప్పించుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రానికి పంపుతామని హామీ ఇచ్చారు.  అవేమీ ఆచరణకు నోచుకోలేదు.మాటి ఇచ్చి ఇలా మోసం చేసిన వ్యక్తితో మీరు ప్రయాణం చేసి, అబద్ధాలను నిజమని నమ్మి మీ పరపతిని తగ్గించుకోవద్దని కోరుతున్నా..’ అని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు.
 
పాదయాత్రకు సిద్ధంగా ఉండండి
ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రకు కాపుజాతి యావత్తూ సిద్ధంగా ఉండాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపు ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement