
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు బహిరంగ లేఖపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. ‘‘చంద్రబాబుకు అధికారం దక్కలేదని మా కుల పత్రికలు బాధలో ఉన్నాయని.. అందుకే కావాలని గోబెల్ ప్రచారం చేస్తున్నాయి’’ అంటూ వంశీ దుయ్యబట్టారు.
‘‘చేతకానోడు రాసే ఉత్తరాలతో ఉపయోగం లేదు. పార్టీ లేదు బొక్కా లేదు.. గట్టి చెట్నీ వేయమన్న వ్యక్తి అచ్చెన్నాయుడు.. ఓ మహిళా ఆఫీసర్‌పై అసభ్యంగా ప్రవర్తించి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు. అచ్చెన్నాయుడు నా గురించి మాట్లాడితే చిట్టా విప్పుతా.. చంద్రబాబు డబ్బు కోసం పదవులు అమ్ముకున్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు సీఎం జగన్.. అందుకే బీసీలకు పదవుల్లో సముచిత స్థానం కల్పించారు’’ అని ఎమ్మెల్యే వంశీ అన్నారు.
చదవండి: పట్టాభి ఎపిసోడ్.. నటన ఫెయిలైందా?.. ఇంతకీ ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment