
టీడీపీని చంద్రబాబు జంతు ప్రదర్శనశాలగా మర్చాడని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు.
సాక్షి, విజయవాడ: టీడీపీని చంద్రబాబు జంతు ప్రదర్శనశాలగా మర్చాడని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్‌కు మీటర్, మోటార్, మేటర్ ఏమీలేదని ఎద్దేవా చేశారు. ఓట్లుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు కరకట్టపై దాక్కున్నాడు. ఏముఖం పెట్టుకుని మోదీ, అమిత్‌షాను చంద్రబాబు కలుస్తాడు. అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్లదాడి చేయించిన ఘనుడు చంద్రబాబు. మోదీని టెర్రరిస్ట్ అని తిట్టిన వ్యక్తి చంద్రబాబు అని వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు.
చదవండి: చంద్రబాబు అంటేనే కుట్రలు: కన్నబాబు