సాక్షి, కృష్ణా జిల్లా: జూనియర్ ఎన్టీఆర్ స్వయం కృషితోపైకి వచ్చాడని.. ఎవరి మీద ఆధారపడ లేదని.. అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఆయన అభివృద్ధిలో ఎవరి పాత్ర లేదన్నారు. మీడియాతో వంశీ మాట్లాడుతూ, చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని కరివేపాకులా పారేశాడని వ్యాఖ్యానించారు. ప్రతి సమస్యలోనూ జూనియర్ ఎన్టీఆర్‌ను లాగడం మంచిది కాదన్నారు.
చదవండి: ఏడు కోట్ల మంది వీక్షకులు.. మంగారాణి యూట్యూబ్ చానల్.. లెసెన్స్.. అదుర్స్
‘‘నిజంగా చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమే ఉంటే గన్నవరం విమానాశ్రయానికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా మారేటప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టేవాడు. భారతరత్నకు పేరు ప్రతిపాదించేవాడు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేవాడు’’ అంటూ వంశీ విమర్శలు గుప్పించారు. మెడికల్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయనపై ప్రజల్లో అభిమానం తగ్గదు. పేరు ప్రతిపాదన అనేది ప్రభుత్వ నిర్ణయం. ఒక ఇంట్లో రెండు ఎలుకలు తిరుగుతుంటే ఇల్లు తగలెట్టేయండి అని సలహా ఇచ్చే వ్యక్తి చంద్రబాబు. పవన్ కల్యాణ్.. టీడీపీ అడిగినా అడగకపోయినా ప్రతి విషయానికి స్పందిస్తాడని వంశీ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment