సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, లాక్‌డౌన్ సమయంలో ధాన్యం కొనుగోలు సమస్యలు, పంటనష్టం, పిడుగుపాటు తదితర అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మాటలు తప్ప చేతలు కనిపించడం లేదని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో జరిగిన పంటనష్టం అంచనాలను సిద్ధం చేసి పరిహారం ఇవ్వాలన్నారు. ఎన్నికల హామీలో భాగంగా రూ.లక్ష పంట రుణమాఫీ తక్షణం అమలు చేయాలని డిమాండ్‌చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా తరుగు, తేమ పేరుతో రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, పిడుగుపాటుతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. ఈమేరకు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment