
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలని కోరారు. అలాగే పోడు భూములకు పట్టాలిస్తామంటూ హామిలివ్వడమే తప్ప అమలు చేయడం లేదన్నారు. మీ రియల్ ఎస్టేట్ దందా కోసం దళితులు గిరిజనుల భూములను లాక్కుంటారా అని మండిపడ్డారు.
అయినా దళితులు, గిరిజనులుపై మీకెందుకు కక్ష అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనుల బతుకులను ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలని లేఖలో పేర్కొన్నారు. అసైన్డ్ భూముల్లో రియల్ దందాకు తెరదించుకుంటే బీజేపీ పక్షాన పెద్ద ఎత్తన ఆందోళ చేపడతామని లేఖలో హెచ్చరించారు.
(చదవండి: ఇప్పుడే ఒక అద్భుతం చూశా, తెలంగాణ బిడ్డగా చాలా సంతోషపడుతున్నా)
Comments
Please login to add a commentAdd a comment