సాక్షి,ఢిల్లీ : తెలంగాణ హైడ్రా బుల్డోజర్ల కూల్చేవేత అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేరింది. తెలంగాణ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి పిర్యాదు చేశాను. గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థులు చనిపోయారు. హైడ్రాను ఒక మాఫియా లాగ మార్చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు చెరువు కింద ఉంది. పేదోడి ఇళ్లను కులగొడుతున్నారు. పేద ప్రజలకు భూములు,ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
👉చదవండి : 'అలా ఎలా కూల్చేస్తారు?'.. హైడ్రాపై హైకోర్టు సీరియస్
కానీ ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై 88 కేసులు ఉన్నాయి. లగచర్లలో ఎస్టీల భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీని సినిమా ప్రమోషన్ అడ్డగా చేశారు. ముఖ్యమంత్రికి గురుకుల, హైడ్రా ఇతర సమస్యలు పట్టవు. అలివి కానీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను ముంచారు. అత్యంత మనువాద పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ హక్కులను ఆలోచలను తెలంగాణ కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నారు’ అని బక్క జడ్సన్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment